కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ నేర్పరి. అందుకే అతని దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ కథను చేయాలనీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోరుకున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఫలించి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉండగా.. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్ వెళ్లనున్నారు. అయితే వీరి చిత్రం గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ చాలా గ్లామర్ గా కనిపించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం విదేశీ స్టైలిష్ ని నియమించినట్లు సమాచారం.
అలాగే కొంచెం బరువు తగ్గి తారక్ కుర్రోడిలా మారిపోనున్నారు. ఇందుకు ముంబయి న్యూట్రిషన్ తో సలహాలు తీసుకొని, నిపుణులు చెప్పినట్లుగా డైట్ ఫాలో కానున్నారు. విహార యాత్ర ముగించుకొని తిరిగిరాగానే ఎన్టీఆర్ లుక్ పై కాన్సంట్రేషన్ పెట్టనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమా ఫిబ్రవరి లో సెట్స్ మీదకు వెళ్లనుంది.