బాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ జోడీలలో అభిషేక్ ఐశ్వర్య జోడీ ఒకటి. ఈ జోడీ కాంబినేషన్ లో తెరకెక్కిన తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈ జోడీ పెళ్లి చేసుకుని ఎంతోమంది ఆదర్శంగా నిలవడం గమనార్హం. అయితే ఈ మధ్య కాలంలో ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమె వెంట అభిషేక్ బచ్చన్ కనిపించడం లేదు. దీంతో ఈ జోడీ విడిపోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే అభిషేక్ బచ్చన్ ఈ వార్తల గురించి స్పందిస్తూ వైరల్ అయిన వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు.
అభిషేక్ బచ్చన్ (Abhishek) స్పందన నేపథ్యంలో ఈ వార్త ఆగిపోతుందేమో చూడాలి. ఐశ్వర్య వెంట అభిషేక్ బచ్చన్ కనిపిస్తే ఇలాంటి రూమర్లు ప్రచారంలోకి రావని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఐశ్వర్య అభిషేక్ జోడీ చూడముచ్చటగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ ఈవెంట్ గ్రాండ్ గా జరగగా ఈ ఈవెంట్ కు ఐశ్వర్యా రాయ్, ఆరాధ్య మాత్రమే రావడం ఈ ప్రచారానికి కారణమైంది.
ఐశ్వర్య అభిషేక్ మధ్య విడాకుల గురించి వార్తలు కొత్త కాదు. గతంలో కూడా ఈ తరహా వార్తలు ప్రచారంలోకి రాగా అభిషేక్ ఐశ్వర్య ఆ వార్తల గురించి స్పందించడం జరిగింది. అభిషేక్ కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐశ్వర్య అభిషేక్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఆమె నటించిన పొన్నియిన్ సెల్వన్2 ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. పొన్నియిన్ సెల్వన్2 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐశ్వర్యా రాయ్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
హీలీవుడ్లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?