Hero Nani: టక్ జగదీష్ మూవీ కొత్త డేట్ ఇదేనా?

  • August 26, 2021 / 01:47 PM IST

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16వ తేదీన టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 23వ తేదీన విడుదలవుతున్నట్టు ప్రకటనలు వెలువడి కరోనా వల్ల ఈ రెండు సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా టక్ జగదీష్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొనగా లవ్ స్టోరీ థియేటర్లలో రిలీజవుతుంటే టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

అయితే లవ్ స్టోరీ, టక్ జగదీష్ ఒకేరోజు రిలీజ్ అవుతాయని వార్తలు వచ్చాయి. తాజాగా నాని, చైతన్య మధ్య ఒప్పందం కుదిరిందని వారం రోజుల గ్యాప్ లో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయని సమాచారం. లవ్ స్టోరీ మూవీ సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ కానుండగా టక్ జగదీష్ సెప్టెంబర్ 17వ తేదీన రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడంతో ఆ సంస్థ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది.

లవ్ స్టోరీ సినిమా రిలీజైన రెండు రోజుల తర్వాత మ్యాస్ట్రో సినిమా ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్ కంపెనీలు తుది నిర్ణయం తీసుకుంటే రిలీజ్ డేట్ గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పోటీ లేకుండా సినిమాలు విడుదలైతే లవ్ స్టోరీ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. లవ్ స్టోరీ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus