Nagarjuna: నాగార్జున సరసన ఆమె ఓకేనా…!

  • September 9, 2023 / 05:45 PM IST

బంగార్రాజు సినిమా తర్వాత అక్కినేని నాగార్జున ఫుల్ లెన్త్ హీరోగా నటించలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బుల్లితెరపై బిగ్ బాస్ 7కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవుట్ అంట్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ నా సామి రంగ చేస్తున్నారు. ప్రముఖ నృత్య దర్శకుడు విజయ బన్నీ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తుండగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో పలాస, శ్రీదేవి సోడా సెంటర్ దర్శకుడు కరుణ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్ డేట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నాగార్జునకు (Nagarjuna) జోడిగా అమిగోస్ ఫేం అశికా రంగనాథ్, బుల్లితెర హాట్ యాంకర్ కమ్ యాక్టర్ వర్షిణిల పేర్లని టీం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజగా వారి లుక్ టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది. చిత్రబృందం త్వరలో ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.

నా సామిరంగా ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకున్నాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు మూవీ టీం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus