Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Advertisement

తమిళ ప్రముఖ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల వ్యవహారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడమే కాకుండా, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళింది. విజయ్‌కు ఒక నటితో సంబంధం ఉందంటూ వస్తున్న పుకార్లు, దానికి తోడు ఆయన రాజకీయ అరంగేట్రం ఈ వివాదాన్ని మరింత కీలకం చేశాయి. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో, ఈ వ్యక్తిగత వివాదం విజయ్‌కు రాజకీయంగా ఇబ్బంది కలిగించకూడదని ఆయన భావిస్తున్నారు.

Vijay Thalapathy

తాజాగా ఈ విడాకుల కేసులో రెండు కీలక అప్‌డేట్లు బయటకు వచ్చాయి. విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… ఈరోజు విచారణ జరిగిన తర్వాత జూన్ 15వ తేదీన ఇరువురూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇది ఇలా ఉండగా శనివారం నాడు ఇద్దరూ తమ న్యాయవాదులతో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ చర్చల్లో భరణం విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. సంగీత సెటిల్మెంట్ కింద ₹250 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ కేవలం ₹35 కోట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ₹35 కోట్లు భరణం ఇచ్చి, కొడుకు, కూతురు బాధ్యతలను తానే చూసుకుంటానని విజయ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ రోజే విడాకులపై స్పష్టత వస్తుందని భావించినప్పటికీ, న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. జూన్ 15న ఇరువురూ స్వయంగా హాజరైనప్పుడు ఈ కేసుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేటి విచారణలో విజయ్ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నట్లు సమాచారం. ఈనెల 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో విడాకుల అంశం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus