Waltair Veerayya: ఉమైర్ సంధుపై మెగా ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకంటే?

  • December 19, 2022 / 08:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య థియేటర్లలో రిలీజ్ కావడానికి 24 రోజుల సమయం మాత్రమే ఉంది. చిరంజీవి శృతి హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో శృతి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. రవితేజకు జోడీగా ఈ సినిమాలో కేథరిన్ నటిస్తూ ఉండగా ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య లిప్ లాక్ సీన్లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. అయితే ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు మెగా అభిమానులకు కోపం తెప్పించడం గమనార్హం. చిరంజీవి శృతి పిక్ గురించి ఉమైర్ సంధు స్పందిస్తూ చిరంజీవి రొమాంటిక్ రోల్స్ లో నటించకుండా సీరియస్ రోల్స్ లో నటిస్తే బెటర్ అని కామెంట్లు చేశారు.

చిరంజీవిగారిని అలాంటి పాత్రల్లో చూసి బోర్ కొడుతోందని ఉమైర్ సంధు అన్నారు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి ఖాతాలో మరో డిజాస్టర్ చేరనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఉమైర్ సంధుకు బుద్ధి లేదని కామెంట్లు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఉమైర్ సంధు చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

రిలీజ్ కాని సినిమా గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేయడం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతుండగా యంగ్ జనరేషన్ డైరెక్టర్లు ఈ స్టార్ హీరోతో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిని ఏ విధంగా ఫ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారో అదే విధంగా చూపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus