‘ఫిదా’ నటుడు సాయి చంద్ గురించి మనకు తెలియని విషయాలు..!

  • June 26, 2021 / 09:48 AM IST

టాలీవుడ్లో చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. సినిమాల్లో దర్శకులు రాసుకునే ప్రాముఖ్యమైన పాత్రలు వాళ్ళ వద్దకే వెళ్తుంటాయి. ఒకవేళ వాళ్లకు అవకాశాలు తగ్గాయి అంటే తట్టుకోలేరు.. ఆవేదన చెందుతుంటారు,అలాగే ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. టాలీవుడ్ లో స్టార్ యాక్టర్ అయిన కోటా శ్రీనివాసరావు గారు కూడా అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘పారితోషికం ఇవ్వక పోయినా పర్వాలేదు.. నటించే అవకాశం ఇవ్వండిరా’ అంటూ రెండేళ్ళ క్రితం ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అయితే నటుడు సాయి చంద్ మాత్రం అవకాశాల కోసం పరితపిస్తుంది లేదు. ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన పాత్రలే చేస్తున్నారు. నిజానికి సాయి చంద్ గురించి ఇంకా చాలా మందికి తెలీదు అంటే అతిశయోక్తి లేదు.

1)1956 వ సంవత్సరం జూన్ 25న సాయి చంద్ జన్మించారు.నేటితో ఆయన 65 వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కర్నూల్.

2) తెలుగు ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప రచయిత త్రిపురనేని రామస్వామి గారి మనవడే మన సాయిచంద్ గారు.

3)సాయి చంద్ తండ్రి త్రిపురనేని గోపీచంద్. ఈయన కూడా గొప్ప రచయితగా ఎదిగారు. అంతేకాదు సినీ పరిశ్రమలో కూడా తన సత్తా చాటారు.పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు అలాగే రచయితగా కూడా పనిచేశారు.

4)సాయి చంద్ గారు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మంచు పల్లకి’ సినిమాలో కలిసి నటించారు.

5) ‘మా భూమి’ ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాల్లో కూడా సాయి చంద్ నటించారు.

6)రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘శివ’ లో హీరోయిన్ అమల అన్నయ్య పాత్రను పోషించారు సాయి చంద్ గారు.

7)1993 లో వచ్చిన ‘అంకురం’ చిత్రం తర్వాత 24 ఏళ్ళ పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు సాయి చంద్.

8) 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో ఈయన రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి తండ్రి పాత్రను పోషించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈయన్ని వెతుక్కుంటూ చాలా అవకాశాలు వచ్చాయి. కానీ సాయి చంద్ తనకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

9)మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రంలో ఈయన పోషించిన సుబ్బయ్య పాత్రకు ప్రశంసలు కురిసాయి. ఎంతో హానెస్ట్ పాత్ర అది. బిగ్ స్క్రీన్ పై చూస్తున్నప్పుడు గూజ్ బంప్స్ తెప్పించింది ఈ పాత్ర.

10)’ఉప్పెన’ చిత్రంలో హీరో వైష్ణవ్ తేజ్ తండ్రి పాత్రలో కూడా ఈయన అద్భుతంగా నటించారు. నిజానికి ‘సైరా’ చిత్రం కోసం ఈ పాత్రని వదులుకోవడానికి కూడా సాయి చంద్ సిద్దపడ్డారు. కానీ చిరంజీవి విన్నపించుకోవడంతో ‘ఉప్పెన’ లో కూడా ఈయన నటించారు.

11) ‘చెక్’ సినిమాలో అత్యంత కీలకమైన సత్య నారాయణ పాత్రని కూడా అలవోకగా చేశారు సాయి చంద్. ఈయన పాత్ర లేనిదే ఈ సినిమా లేదు అనిపిస్తుంది. రాంగ్ టైం లో రిలీజయ్యి పరాజయం పాలయ్యింది కానీ ఇది కూడా మంచి సినిమానే అని చాలా మంది చెబుతుంటారు. ఇక ‘రానా’ హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు సాయి చంద్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus