Chiranjeevi: చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రంభ హీరోయిన్ గా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ సమర్పణలో ‘ఎం.ఎల్.ఆర్ట్స్’ బ్యానర్ పై ఎం.వి.లక్ష్మీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్లర్’. కోటి ఈ చిత్రానికి సంగీతం అందించగా కె.దత్తు సినిమాటోగ్రఫీ అందించాడు. 1997 వ సంవత్సరం జనవరి 4న ఈ చిత్రం విడుదలైంది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తికావస్తోంది.కాబట్టి ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి :

1)’హిట్లర్’ కు ముందు వరకు మెగాస్టార్ చిరంజీవి వరుస ప్లాప్ లు ఫేస్ చేస్తూ వచ్చారు. ‘బిగ్ బాస్’ ‘రిక్షావోడు’ ‘ఎస్.పి.పరశురామ్’ వంటి సినిమాలు ఒకదాని మించి ఒకటి అన్నట్టు ప్లాపులు అయ్యాయి. మరోపక్క వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి డైలమాలో పడిపోయారు.కొన్నాళ్ళు గ్యాప్ కూడా తీసుకున్నారు.

2)అదే టైంకి మలయాళంలో ‘హిట్లర్’ అనే మూవీ సూపర్ హిట్ అయ్యింది. మమ్ముట్టి ఆ సినిమాలో హీరోగా నటించారు. ఎడిటర్ మోహన్ గారు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారు.

3)మొదట ఎడిటర్ మోహన్ గారు ఈ రీమేక్ ను మోహన్ బాబు తో తెరకెక్కించాలి అనుకున్నారు. అందుకు ఇవివి సత్యనారాయణ గారిని సంప్రదించారు. కాకపోతే అదే టైంకి వీరి కాంబోలో ‘వీడెవడండీ బాబు’ సినిమా రూపొందుతుండడంతో ఈ ఆఫర్ కు వారిద్దరూ నొ చెప్పారు.

4)దాంతో చిరంజీవి గారు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నారు అని తెలుసుకున్న ఎడిటర్ మోహన్ గారు.. వెళ్ళి ఈ మూవీ గురించి చిరుకి చెప్పారు. దాంతో చిరు ఒకసారి ఆ సినిమాని స్పెషల్ గా షో వేయించుకుని వీక్షించారు. ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి మోహన్ రాజా.. చిరుకి ఆ సినిమాలో డైలాగులని అర్ధమయ్యేలా పక్కన కూర్చొని చెప్పారు.

5)చిరుకి ఆ కథ బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ దర్శకుడిని వెతకడం. చాలా మందిని అనుకుని ముత్యాల సుబ్బయ్యని ఎంపిక చేసుకున్నారు.

6)రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, ప్ర‌కాశ్ రాజ్, బ్ర‌హ్మానందం, పొన్నంబ‌లం, బాబూ మోహ‌న్, సుధాక‌ర్, ఉత్తేజ్, క‌ల్ప‌నా రాయ్, అచ్యుత్, వంటి స్టార్ క్యాస్ట్ ను ఎంపిక చేసుకున్నారు.

7)ఈ కథని చిరు ఎంపిక చేసుకున్నందుకు కూడా చాలా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఎందుకు 5 మంది చెల్లెళ్లకు అన్నయ్యగా.. ఫ్యామిలీ డ్రామా చెయ్యాల్సిన అవసరం చిరుకి ఏంటి? అంటూ ఫ్యాన్స్ పెదవి విరిచారు.

8) 3 నెలల్లో షూటింగ్ ను ఫినిష్ చేశారు. 1997 సంక్రాంతికి 10 రోజుల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

9) మొదట్లో డివైడ్ టాక్ వినిపించినప్పటికీ.. తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ ‘హిట్లర్’ కు బ్రహ్మరథం పట్టారు. సినిమా ఎన్నో రికార్డుల్ని తిరగరాసి చిరుకి స్ట్రాంగ్ కంబ్యాక్ ను అందించింది.

10)ఇందులో ‘హిట్లర్ మాధవ రావు ఇల్లెక్కడ’ అంటూ బ్రహ్మీ అనగానే చిరు చాచి పెట్టి కొట్టే సీన్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తూనే ఉంది.

11)కమెడియన్ ఎల్.బి.శ్రీరామ్ అందించిన సంభాషణలు కూడా చాలా బాగా కుదిరాయి.

12)క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ హిట్లర్ చెల్లెళ్ళకి హిత బోధ చేసేటప్పుడు పలికిన ‘అరె ఉల్లిపాయలు తరిగితే ఎక్కడ మీ కంట్లో నీళ్లు వస్తాయోనని భావించి వాటిని వాడటం మానేసిన వెర్రి బాగులోడే మీ అన్నయ్య’ అనే డైలాగ్ కూడా థియేటర్ల నుండీ బయటకి వచ్చిన ప్రేక్షకుల్ని వెంటాడింది.

13) కోటి సంగీతంలో రూపొందిన పాటలు ‘మిస మిస మెరుపుల‌ మెహబూబ’, ‘క‌న్నీళ్ళ‌కే క‌న్నీళ్ళు’, ‘ఓ కాల‌మా..’, ‘కూసింది క‌న్నె కోయిల‌’, ‘ప్రేమా జోహార్’ వంటి పాటలన్నీ చార్ట్ బస్టర్లే..!

ఇలా ‘హిట్లర్’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! ఇప్పటికీ ఈ చిత్రం బుల్లితెర పై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. బోరు కొట్టినప్పుడు మళ్ళీ మీరు ఈ చిత్రాన్ని ఓ లుక్కెయ్యండి :

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus