Jai Chiranjeeva: 17 ఏళ్ళ ‘జై చిరంజీవ’ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు..!

  • December 21, 2022 / 07:27 PM IST

కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి. మరికొన్ని కాంబినేషన్లు చరిత్రలో మిగిలిపోతాయి. ఇలాంటి కాంబినేషనే త్రివిక్రమ్ – విజయ్ భాస్కర్ లది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాలి. త్రివిక్రమ్ రైటర్ గా అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయనకు విజయ్ భాస్కర్ తగిలారు. వీరి కాంబినేషన్లో ‘స్వయం వరం’ ‘నువ్వే కావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మన్మథుడు’ ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇవి క్లీన్ ఎంటర్టైనర్స్ అలాగే క్లాసిక్స్ కూడా..! ఇప్పటికీ ఈ సినిమాలు టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి అంటే.. కదలకుండా కూర్చుని చూసే జనాలు చాలా మంది ఉన్నారు. అలాంటి ఈ కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘జై చిరంజీవ’ అనే టైటిల్ తో సినిమా రూపొందుతుంది అంటే అంచనాలు ఏ రేంజ్లో ఏర్పడతాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 17 ఏళ్ళు పూర్తికావస్తోంది. 2005 వ సంవత్సరం డిసెంబర్ 21న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు తన తర్వాతి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేశారు. అదే ‘అందరివాడు’ చిత్రం. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది కానీ.. తర్వాత సైలెంట్ అయిపోయి చివరికి యావరేజ్ బొమ్మగా మిగిలింది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఈ సినిమా ఫలితం అనుకున్నట్టు రాకపోవడంతో తన తర్వాతి చిత్రమైన ‘జై చిరంజీవ’ కి అల్లు అరవింద్ ను దూరం పెట్టారు చిరు. ఆయన తన తర్వాతి చిత్రం కోసం అశ్వినీదత్ కి డేట్స్ ఇచ్చారు.

2) కానీ కథ ఫైనల్ అవ్వలేదు. దర్శకుడు ఫైనల్ అవ్వలేదు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్.. దర్శకుడిగా మారి ‘నువ్వే నువ్వే’ ‘అతడు’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ క్రమంలో దత్ గారు ఓ లైన్ ను తన టీంతో డెవలప్ చేయించాలి అని ట్రై చేశారు. ‘తన కూతురు యాక్సిడెంటల్ గా చనిపోతే..ఓ తండ్రి ఎంత బాధపడతాడు.. తర్వాత ఆ పాప యాక్సిడెంటల్ గా కాదు.. ఓ కిరాతకుడు టైం పాస్ కు చంపేశాడు.. అని తెలుసుకున్న తండ్రి.. ఆ కిరాతకుడుని ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు’ అన్నది లైన్.

3) ఇదే లైన్ ను అప్పుడు భీభత్సమైన ఫామ్లో ఉన్న దర్శకుడు విజయ్ భాస్కర్ కు వినిపించారు. ఈయనతో సినిమా చేయాలని ‘మన్మథుడు’ టైం నుండి చిరు ఆశపడుతున్నారు. కాబట్టి ఇలా వీరి కాంబో సెట్ అయ్యింది. కానీ ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు.

4) దీంతో ‘అతడు’ చిత్రాన్ని నిర్మించిన మురళీ మోహన్ గారి రిఫరెన్స్ తో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ ను మళ్ళీ విజయ్ భాస్కర్ వద్దకు రైటర్ గా తీసుకొచ్చారు చిరు.

5) త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇబ్బంది పడుతూనే పనిచేశాడు. చిరు పై గౌరవం, తన గురువు దగ్గర మొహమాటం.. ఇలాగే ఇబ్బంది పడ్డాడు. ఇదే క్రమంలో విజయ్ భాస్కర్ తో కలిసి చిరు ‘చూడాలని ఉంది’ కి మొదట అనుకున్న కథకి పోలికలు వస్తాయని అభిప్రాయపడి తండ్రిని కాస్త మేనమామను చేశారు.

6) ఇది వర్కౌట్ అవ్వదు అని తెలిసినప్పటికీ విజయ్ భాస్కర్ కానీ త్రివిక్రమ్ కానీ నొ చెప్పలేకపోయారు. త్రివిక్రమ్ తనకు అలవాటైన కామెడీ సీన్స్, డైలాగ్స్ రాసుకుని సరిపెట్టాడు.

7) ఈ సినిమాకి రీ షూట్లు వంటివి కూడా ఎక్కువగా జరిగాయి. ముందు రూ.20 కోట్లు అనుకున్న బడ్జెట్ రూ. చివరికి ఇంకో రూ.9 కోట్లకు పైగా పెరిగింది.

8) సంగీత దర్శకుడిగా ముందు చిరు దేవి శ్రీ ని తీసుకుందాం అనుకున్నారు. విజయ్ భాస్కర్ కోటి అన్నారు. వీరిద్దరూ కాదని దత్ గారు .. తనకు ఇష్టమైన మణిశర్మని తెచ్చిపెట్టుకున్నారు. మణిశర్మ అందించిన బాణీలు బాగానే కుదిరాయి. ఆడియో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం ఆడియో క్యాసెట్స్ బాగా సేల్ అయ్యాయి. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అనడానికి ఇది పెద్ద ఉదాహరణ.

9) అయితే సినిమా విడుదల రోజు రానే వచ్చింది. ఉదయం ఫ్యాన్స్ షో పడింది. షో చూస్తున్నంత సేపు ఏదో తెలీని వెలితి అభిమానుల్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత బాగున్నాయి. కానీ చిరు ఇమేజ్ కు తగ్గ కథ ఇది కాదు కదా అని..!

10) చివరికి వారి అనుమానమే నిజమైంది. ఈవెనింగ్ షోలకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సినిమాలో కామెడీ బాగుంది. కానీ కథ ఎక్కడ మొదలైందో ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక ప్రేక్షకులు జుట్టు పీక్కున్నారు. ఓపెనింగ్స్ వల్ల , సోలో రిలీజ్ వల్ల సినిమా బిలో యావరేజ్ అన్నట్టు ఆడింది కానీ ‘అందరివాడు’ కలెక్షన్స్ ను కూడా దాటలేకపోయింది.

11)’జై చిరంజీవ’ సినిమా నిర్మాత అశ్వినీ దత్ గారు సేఫ్ అయ్యారు. అప్పట్లో టికెట్ రేట్లు రూ.35 మాత్రమే ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం వద్ద పర్మిషన్ తెచ్చుకుని 2 వారాల పాటు ఈ చిత్రం టికెట్ రేట్లు రూ.70 పెట్టారు. అది ఎక్కువ ఓపెనింగ్స్ రావడానికి సాయపడింది. కానీ బ్రేక్ ఈవెన్ అయ్యేంత వరకు.. డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యే వరకు అయితే కాదు.

12) ‘జై చిరంజీవ’ చిత్రం వల్ల అప్పటివరకు సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్ భాస్కర్ – త్రివిక్రమ్ లు చెరో దారి చూసుకున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికీ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు కానీ విజయ్ భాస్కర్ మాత్రం ‘ప్రేమ కావాలి’ వంటి యావరేజ్ హిట్ తో సరిపెట్టుకుని.. ఇక ‘మసాలా’ నూరలేక వెనుదిరిగారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus