టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి సైతం సుకుమార్ ట్యాలెంట్ ను చూసి భయపడుతుంటాడు. ‘ఆర్య’ ‘100% లవ్’ ‘రంగస్థలం’ వంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు సుకుమార్. దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా మారి.. తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ తన ఖ్యాతిని మరింతగా పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.
అయితే మన లెక్కల మాష్టారు ఫ్యామిలీ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండదు. సుకుమార్ భార్య పేరు తబిత. 2009 లో సుకుమార్ ఈమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఒక పాప ఒక బాబు. ఈ మధ్యనే సుకుమార్ భార్య తబిత ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో లాండ్రీ బిజినెస్ ను మొదలుపెట్టింది. అంతేకాదు సుకుమార్ బ్యానర్ అయిన ‘సుక్కూ రైటింగ్స్’ కీలక బాధ్యతలను కూడా ఈమె స్వీకరించింది.
సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. సుకుమార్ ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :