కాజల్ ఫియాన్సీ గౌతమ్ కిచ్లు గురించి ఆసక్తికరమైన సంగతులు..!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఓ ప్రముఖ బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లును ఈమె వివాహం చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 30న ముంబైలో వధూవరుల కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని కూడా కాజల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఇంతకీ కాజల్ పెళ్లి చేసుకోబోతున్న గౌతమ్ కిచ్లు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతను ఎటువంటి బిజినెస్ చేస్తాడు? అని తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. గౌతమ్ కిచ్లు ఓ ఇంటీరియర్ డిజైనర్ కమ్ టెక్ ఎక్స్‌పర్ట్.

ఆయన ముంబైలో ‘డిసెర్న్ లివింగ్’ (Discern Living) అనే ఈ-కామర్స్ కంపెనీని నడుపుతున్నాడు. ఇంటీరియర్ డిజైన్ మరియు హోమ్ డెకరేషన్ వంటి సర్వీసులను ఈ కంపెనీ ద్వారా కష్టమర్లు పొందుతున్నారు. హౌస్ డిజైనింగ్, రూమ్ డిజైనింగ్‌ వంటి సర్వీసులతో పాటు డిజైనర్ ఫర్నీచర్ మరియు డెకార్ ఐటమ్స్, పెయింటింగ్స్, వంటి ఇతర హౌస్‌హోల్డ్ ఐటమ్స్‌ను కూడా ‘డిసెర్న్ లివింగ్’ కంపెనీ పంపిణీ చేస్తుంది. ఇంటిని, గదులను ఎలా అలంకరించుకోవాలి అనే విషయాలను తన ఇన్స్టా గ్రామ్ ద్వారా తన ఫాలోవర్స్ కు అలాగే కష్టమర్లకు తెలియజేస్తుంటాడు గౌతమ్.

ఇక గౌతమ్ మంచి రన్నర్ అట. ముంబై మారథాన్‌లలోనూ ఇతను పాల్గొంటుంటాడని తెలుస్తుంది.ముంబై కు చెందిన కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో గౌతమ్ చదువుకున్నాడు.అంతేకాదు మసాచుసెట్స్‌ (యూఎస్)లోని టుఫ్ట్స్ యూనివర్సిటీలో తన ఉన్నత విద్యను కంప్లీట్ చేసాడట గౌతమ్.ఇక కాజల్ కు ఇతను చిన్ననాటి స్నేహితుడట. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇప్పుడు వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Most Recommended Video

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus