Sarika: విధి వెక్కిరింపులు, కష్టాలు… కమల్ హాసన్ భార్య సారిక గురించి షాకింగ్ విషయాలు..!

కమల్ హాసన్ మాజీ సతీమణి సారిక గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చేమో కానీ .. 80వ దశకంలో ఆమె బాగా పాపులర్. ఢిల్లీలోని రాజ్ పుత్ ల వంశంలో జన్మించిన ఆమె జీవితం కష్టాల మయం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడం, కమల్ హాసన్ తో ప్రేమ , పెళ్లి, విడాకులు, ఆర్ధిక కష్టాలు ఇలా ఒక్కటి కాదు సారిక తన జీవితాన్ని కొనసాగించేందుకు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఆమె జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘట్టాలను , కీలక మలుపులను ఒకసారి చూస్తే:

1. తల్లిదండ్రులు విడిపోవడంతో నాలుగేళ్ల పసిప్రాయంలోనే సారిక పనిచేయడం మొదలుపెట్టారట. చదువుకోవడానికి బదులు సినీ స్టూడియోల వెంట పడ్డారామె. చివరికి ఆడుకోవడానికి కూడా వీలు కుదరలేదు.

2. బాలీవుడ్ దర్శక దిగ్గజం బీఆర్ చోప్రా రూపొందించిన హమ్ రాజ్ చిత్రంలో మాస్టర్ సూరజ్ పేరుతో అబ్బాయి పాత్రలు వేస్తూ బాలనటిగా పేరు తెచ్చుకుంది.

3. 21 సంవత్సరాల వయసులో చేతిలో చిల్లిగవ్వ లేకుండా , కట్టుబట్టలతోనే తన ఇంటిని, తల్లిని వదిలి వచ్చేసింది. ఏం చేయాలో తెలియక కారునే ఇంటిగా చేసుకుని గడిపిందట సారిక

4. ఇక ఆమె జీవితంలో కీలక మలుపు విశ్వనాయకుడు కమల్ హాసన్ తో పెళ్లి. 28 ఏళ్ల వయసులో ఆయనను పెళ్లాడిన సారిక తనకు అప్పటి వరకు తోడుగా నిలిచిన నటనను వదిలిపెట్టేసింది.

5. నటన విడిచిపెట్టేందుకు మరో కారణం కూడా వుంది. ఒకటి పెళ్లయితే, రెండోది అందాన్ని కాపాడుకోవాల్సి రావడం. నటిగా వున్నప్పుడు రోజూ అందంగా వుండేందుకు తలస్నానం చేయడంతో పాటు మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే తను టెక్నీషియన్ అవతారమెత్తింది.

6. అలా కాస్ట్యూమ్ డిజైనర్ గా అదృష్టం పరీక్షించుకుంది. తన భర్త కమల్ హాసన్ నటించిన ‘‘హే రామ్’’ మూవీకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడమే కాదు.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డును సైతం ఆమె అందుకున్నారు.

7. ఇకపోతే.. దాదాపు 15 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరిద్దరి కాపురం ఆ తర్వాత బీటలు వారింది. దీంతో శృతి, అక్షరను వదిలిపెట్టి ముంబైకి వెళ్లిపోయిన సారిక.. సుదీర్ఘ విరామం తర్వాత నటనను మొదలుపెట్టింది.

8. తన చేతుల్లో ఇద్దరు పసిబిడ్డలు వుండటం.. వారి ఆలనా పాలనా చూడాల్సి రావడంతో నటించక తప్పలేదు. ఆ సమయంలో ఆమెకు కనీసం బ్యాంక్ ఖాతా కూడా లేదంటే నమ్మశక్యం కాదు. అలా రాహుల్ డొలాకియా దర్శకత్వంలో నటించిన ‘పర్జానియా’ సినిమాలో నటనకు గాను ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును పొందింది. అన్నేళ్ల

9. ఈ సంగతి పక్కనబెడితే… భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో సారిక అప్పట్లో ప్రేమలో పడిందట. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారట. కపిల్ దేవ్ కోసం ఆమె చంఢీగడ్ వెళ్లేది. అయితే అక్కడా సారికకు ఎదురుదెబ్బే తగిలింది. అప్పటికే కపిల్ దేవ్ కు రోమి అనే ప్రేయసి వుందని, వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి సారిక గుండెబద్ధలైంది.

10. మరోవైపు.. కరోనా సమయంలో తన దగ్గర డబ్బులు లేవని సారిక ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయని స్వయంగా శృతీ హాసన్ కూడా ఒక సందర్భంలో చెప్పారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus