కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రాంచరణ్ భార్య.. అపోలో వారి మనవరాలు.. అనే ట్యాగ్ లైన్ లు మాత్రమే కాదు… తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా మెలిగే మహిళగా.. అపోలో ద్వారా పేద వారికి కూడా తన వంతు వైద్యం ఫ్రీగా అందించే సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది. అంతేకాదు మూగ జీవాలను కూడా ఈమె పెంచుకుంటూ ఉంటుంది. మానవత్వం కలిగిన మహిళ అనిపించుకుంటూ ముందుకు సాగుతుంది.
ఇక మెగాస్టార్ ఇంటి కోడలిగా.. కుటుంబ బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తునే.. రాంచరణ్ కు సంబంధించి అప్డేట్స్ ను అలాగే తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేయిస్తుంటుంది. అలాంటి ఉపాసన పెళ్ళైనప్పుడు ఆమె అనుభవం ఎలా ఉందో తెలిపి షాక్ కు గురిచేసింది. ఉపాసన మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండీ నా తల్లిదండ్రులు నాకు ఫ్రీడమ్ ఇచ్చి పెంచారు. ఈ సమాజంలో నమ్మకంగా జీవించడం ఎలాగో నేర్పిస్తూనే అన్ని విషయాల్లో.. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. దాని వల్లే ఈరోజున నేను సొంతంగా నిలబడగలిగాను.
నా లైఫ్ లో నా తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో అయినా దైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆయన వద్దనే నేర్చుకున్నాను. ఇతరులను ప్రేమించడం, ఆప్యాయత చూపించడం లాంటి ఎన్నో అంశాలు నా తండ్రి ద్వారానే తెలుసుకున్నాను. అయితే పెళ్ళి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మెట్టినింట్లో అడుగుపెట్టాక.. జీవితంలో సర్దుబాటు అంటే ఏమిటో తెలిసొచ్చింది. అడ్జస్ట్ అయ్యి బ్రతకడం నేర్చుకున్నాను. కాస్త ఇబ్బంది గా అనిపించినా తరువాత పర్వాలేదు అనిపించింది. నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!