Upasana: ఆ అవార్డ్ ను సొంతం చేసుకున్న ఉపాసన.. ఏమైందంటే?

మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. రామ్ చరణ్ భార్యగా, చిరంజీవి కోడలిగా వ్యాపారవేత్తగా ఆమెకు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఉపాసన ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. వైద్య రంగంలో సేవలు చేస్తున్న ఉపాసన తాజాగా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ 2022 – 23 జాబితాలో ఒకరిగా నిలిచారు. ఉపాసన చేసిన సేవలకు అవార్డ్ లభించడం గమనార్హం. ఉపాసన మరో అరుదైన ఘనతను అందుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఉపాసన మరో అవార్డును సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఉపాసన ఒక్కో మెట్టు పైకి ఎక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి అన్ని రంగాల్లో విజయాలు దక్కుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఉపాసన మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సామాజిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ ఉపాసన తన మంచి మనస్సును చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో మెగా కుటుంబానికి కోడలైన ఉపాసన కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

విమర్శలను సైతం పాజిటివ్ గా తీసుకుంటూ ఫ్యాన్స్ కు ఉపాసన మరింత దగ్గరవుతున్నారు. చరణ్ కెరీర్ పరంగా ఎదిగే విషయంలో ఉపాసన తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుస్తోంది. చరణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాలు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus