Upasana: ఆ మాటల అనడంతో హర్ట్ అయిన ఉపాసన!

  • November 2, 2023 / 08:20 PM IST

మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు నిమిత్తం ఇటలీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా గత వారం రోజులుగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలోనే వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో సందడి చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిలా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన కుమార్తె క్లీన్ కారా చాలా అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈమె ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడినప్పటికీ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి అయితే తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలలో ఉపాసన రాంచరణ్ కొందరి మాటలు కారణంగా హార్ట్ అయ్యారని తెలుస్తుంది. ముఖ్యంగా క్లీన్ కారా విషయంలో ఉపాసన చాలా బాధపడినట్లు ఒక వార్త వైరల్ గా మారింది.

ఉపాసన రాంచరణ్ దంపతులకు పెళ్లి అయిన 11 సంవత్సరాలకు కూతురు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కూతురు జన్మించడంతో ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన కుమార్తెతో కలిసి అల్లు అర్జున్ కుమారుడు చాలా సరదాగా ఆడుకుంటూ కనిపించారట అయితే వీరిద్దరూ ఇలా ఆడుకుంటూ ఉండటంతో పెళ్లికి వచ్చినటువంటి బంధువులు కొందరు వీరిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ సరదాగా మాట్లాడారట.

ఇక క్లీన్ కారా పుట్టినప్పుడు కూడా అభిమానులు ఈ వార్తలను పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అయితే తాజాగా ఉపాసన ఎదురుగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఉపాసన కాస్త ఫీలయ్యారని తెలుస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి చిన్న పిల్లలను ఎప్పుడూ కూడా చిన్న పిల్లల లాగే పెరగానివ్వాలని వారి చుట్టూ అలాంటి వాతావరణమే క్రియేట్ చేయాలి కానీ ఇలాంటి మాటలు ఏంటి అంటూ కాస్త నోచ్చుకున్నారని తెలుస్తుంది. అయితే మరిది పెళ్లి కావడంతో ఆ మాటలు అక్కడితోనే మర్చిపోయిన ఉపాసన (Upasana) లావణ్య, వరుణ్ పెళ్లి వేడుకలలో సంతోషంగా పాల్గొన్నారని తెలుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus