మెగాస్టార్ కోడలు ఉపాసనకు వైద్య రంగంలో ఎంతో అనుభవం ఉంది. నిత్యం డాక్టర్లతో సమావేశాలు, చర్చల్లో పాల్గొనే ఆమెకు ఆరోగ్య జాగ్రత్తల (Health Tips) పై మంచి అవగాహన ఉంది.ఆ ఆసక్తితోనే ఆమె ఆరోగ్య పానీయాల సంస్థను ప్రారంభించి. సొంతంగా వ్యాపారాన్ని నడిపిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. తాజాగా చరణ్, బోయపాటి టీమ్ కి కొన్ని హెల్త్ టిప్స్ చెప్పింది. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత బోయపాటి డైరక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం ప్రమోషన్లో పాల్గొనాలని చిట్టిబాబు లుక్ ని తీయకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు.
అందుకే బోయపాటి చరణ్ లేకుండా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ ఎండల్లో జరగనుండడం. పైగా లోకేష్ రాజస్థాన్ కావడంతో. రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్‌కి కూడా ఉపాసన కొన్ని టిప్స్ చెప్పినట్లు సమాచారం. రంగస్థలం షూటింగ్ సమయంలో సమంత ఎండకి తాళలేక కళ్ళుతిరిగిపడిపోయి. షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. అటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలని ఈ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సమాచారం.