Upasana: సద్గురు ఇచ్చే అవార్డు తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టు ఉపాసన పోస్ట్?

మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనను 10 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు కావడంతో వీరి పదవ వివాహ వార్షికోత్సవం ఇటలీలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు వీరికి వారసులు లేరనే లోటు అలాగే ఉండిపోయింది. ఇకపోతే మెగా వారసుడి కోసం అభిమానుల సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూడటమే కాకుండా పలుమార్లు ఈ విషయం గురించి ఉపాసన దంపతులను ప్రశ్నించారు.

ఈ విధంగా ఉపాసన ఈ ప్రశ్న గురించి అడిగినప్పుడు తనదైన శైలిలో సమాధానం చెబుతూ సమయం వచ్చినప్పుడు తానే ఈ విషయం గురించి మాట్లాడతానని వెల్లడించారు. అయితే ఈ పదేళ్ల కాలంలో ఉపాసన ఒక్కసారి కూడా స్వయంగా పిల్లల గురించి ప్రస్తావన తీసుకురాలేదు కాకపోతే తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా ఉపాసన సద్గురుని పిల్లల గురించి అడిగిన విషయం మనకు తెలిసిందే. నన్నే అందరూ పిల్లల గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ సద్గురుని ఉపాసన ప్రశ్నించారు.

ఉపాసన అడిగిన ప్రశ్నకు సద్గురు కూడా సమాధానం చెబుతూ ఈ ప్రజెంట్ జనరేషన్ లో పిల్లల అవసరం లేదని, పిల్లల అవసరం లేదనుకున్న వారికి తాను ఒక బహుమానం ఇస్తానని సద్గురు చెప్పిన విషయం వైరల్ అయింది. ఇకపోతే తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో భాగంగా సద్గురు ఇచ్చే కానుక స్వీకరించడానికి తన తాత సిద్ధంగా లేరని ఈమె వెల్లడించారు.

ఈ విధంగా సద్గురు పిల్లలు కనకపోతే బహుమానం ఇస్తానని చెప్పారు. అయితే ఆ బహుమానం స్వీకరించడానికి ఉపాసన కుటుంబం సిద్ధంగా లేకపోవడంతో ఈమె త్వరలోనే పిల్లల గురించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus