చరణ్ కు ఉపాసన టిపికల్ రూల్!
- June 21, 2016 / 05:45 AM ISTByFilmy Focus
ప్రస్తుతం సెల్ ఫోన్లు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మన జీవితంలో ఎటువంటి పాత్రలు పోషిస్తున్నాయో తెలియది కాదు. ఇందుకు స్టార్ హీరోలు కూడా అతీతులు కారు. అందుకే రామ్ చరణ్ కూడా సెల్ ఫోన్, ఫేస్ బుక్, ట్విట్టర్ కు బాగా ఎడిక్ట్ అయిపోకూడదని అతడి భార్య ఉపాసన అతనికి ఓ వింత రూల్ పెట్టింది.
సంవత్సరం మొత్తం ఎంత బిజీగా గడిపినా.. ఓ వారం మాత్రం ఎక్కడికైనా మారుమూల ప్రదేశానికి వెళ్లడమే కాకుండా అక్కడ సెల్ ఫోన్ ను కనీసం కన్నెత్తి కూడా చూడకూడది చెప్పిందట. స్వయానా తన సగభాగం ఆర్డర్ జారీ చేయడంతో అందుకు సరేనన్నాడట చరణ్!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















