రంగస్థలంలో రామ్ చరణ్ పాత్ర ఏమిటో చెప్పిన ఉపాసన
- December 23, 2017 / 01:30 PM ISTByFilmy Focus
ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చేస్తున్నారు. గ్రామీణ యువకుడిగా చెర్రీ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇది విశేషంగా ఆకట్టుకుంది. అలాగే కొన్ని స్టిల్స్ బయటికి వచ్చాయి. పాతిక సంవత్సరాల క్రితం పల్లెటూళ్లలో ఎలా ఉంటారో.. అలాంటి వాతావరణం ఫొటోలో కనిపించింది. అలాగే రామ్ చరణ్, సమంత కూడా పాత్రలకు తగ్గ వస్త్రధారణలో మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు పాటలు కూడా త్వరలో గోదావరి జిల్లాల్లో తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రంలో చెర్రీ రోల్ గురించి ఉపాసన హింట్ ఇచ్చింది.
రామ్ చరణ్ ఈ ఏడాది క్రిస్టమస్ వేడుకలను దివ్యాంగులతో కలిసి జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. చిన్నారులతో సరదాగా గడిపిన వీడియోని, ఫోటలను షేర్ చేసిన ఉపాసన చరణ్ ఈ చిన్నారులకు ఇంతగా ఎందుకు దగ్గరయ్యారో మీకు త్వరలోనే తెలుస్తుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో చరణ్ రంగస్థలంలో చెవిటి వాడిగా కనిపించనున్నట్లు అర్ధమవుతోంది. జగపతి బాబు, అది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న థియేటర్లోకి రానుంది.

















