మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసనల గారాల పట్టి క్లిన్ కారాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ అయినా క్షణాలలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఉపాసనలకు వివాహం జరిగిన తర్వాత 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించడంతో ఈమెకు సంబంధించి ఎలాంటి వార్త అయినా కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ చిన్నారి జూన్ 20 తేదీ జన్మించినప్పటికీ ఇప్పటివరకు ఈమె ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం తెలియచేయలేదు.
ఈ క్రమంలోనే క్లిన్ కారాను చూడటం కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన కుమార్తె క్లిన్ కారా కూడా తన మొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు అంటూ ఉపాసన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలలో చిన్నారికి సాంప్రదాయ దుస్తులను ధరింపజేశారు.ఇక ఈ ఫోటోలలో ఈ చిన్నారి తన తాతయ్య అమ్మమ్మలతో కలిసి జండా ఎగరవేస్తూ ఉన్నటువంటి ఫోటోని ఉపాసన షేర్ చేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాసన ఈ ఫోటోని షేర్ చేయడమే కాకుండా క్లిన్ కారా తన మొదటి ఇండిపెండెన్స్ డే ను తన తాతయ్య అమ్మమ్మలతో కలిసి జరుపుతుందని, ఈ క్షణాలు ఎంతో అద్భుతం అంటూ ఉపాసన ఈ ఫోటోలను షేర్ చేశారు.
ఇక ఈ ఫోటోలలో భాగంగా చిన్నారి ఫేస్ ఒకవైపు కనిపించేలాగా మాత్రమే ఉండడంతో మెగా అభిమానులు చిన్నారి ఫోటోని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా మొదటిసారి ఉపాసన తన కుమార్తె ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. అయితే తన కుమార్తె పూర్తి ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.