Upasana: ఉపాసన కొణిదెల ధరించిన స్టైలిష్ డాట్స్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల.. తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ చెప్పారు.. పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ జంట పేరెంట్స్‌గా ప్రమోట్ అవ్వబోతున్నారు.. అప్పటి నుండి వార్తల్లో నిలుస్తున్నారు.. 2012లో చెర్రీ – ఉపాసన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. 2022లో టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న చెర్రీ – ఉపాసన ప్రస్తుతం పేరెంట్ హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇటీవల ఉపాసన ఫ్రెండ్స్.. ఆమె ప్రెగ్నెన్సీని సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసి.. ఆమెకు విషెస్ తెలియజేశారు.. ‘బేబీ కమింగ్ సూన్’ అంటూ ఆ ఫోటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ నుండి హైదరాబాద్ తిరిగొచ్చిన చెర్రీ.. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట సెట్‌లోనే ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేశారు.. తర్వాత పుట్టినరోజు పార్టీతో ఫుల్ బిజీ అయిపోయాడు..

ఆ పార్టీలో మెగా కోడలు ఉపాసన బేబి బంప్‌తో కనిపించారు.. చరణ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటే ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లిపోయాడు.. ఈ సెలబ్రిటీ కపుల్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు.. ప్రైవేట్ జెట్‌లో ట్రావెల్ చేస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.. వీడియోతో పాటు చరణ్ తన పెట్ రైమ్‌ని ఒళ్లో కూర్చోబెట్టుకున్న పిక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.. వెకేషన్‌కి వెళ్తున్న ఈ సెలబ్రిటీ కపుల్ ఇద్దరు స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోయారు..

ఉపాసన (Upasana) .. బయట ఎక్కడ కనిపించినా ఆమె స్టైలింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.. పెద్దగా హంగూ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా కనిపిస్తుంటారు.. ఈమధ్య ఆమె ధరించిన లెహంగా డిజైన్, కాస్ట్ గురించి న్యూస్ వైరల్ అయింది.. రీసెంట్‌గా ఎయిర్ పోర్టులో ఆమె బ్యూటిఫుల్ షర్ట్ వేసుకుని కనిపించారు.. అది Louis Vuitton – LV x YK Infinity Dots Monogram Shirt – కాస్ట్ : రూ. 1,73,085/-..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus