1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

ఒకప్పుడు వెయ్యి కోట్లు అంటే ఇండియన్ సినిమాకు అందని ద్రాక్ష. కానీ దంగల్, బాహుబలి 2 ఆ ఆనవాయితీని బ్రేక్ చేశాక సీన్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పఠాన్, జవాన్ ఆ మార్క్ ను ఒక అలవాటుగా మార్చేశాయి. ఇక ఈమధ్య కాలంలో గా కల్కి, పుష్ప 2, ధురంధర్ విజయాలతో ఆ క్లబ్ లో ట్రాఫిక్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు అందరి చూపు 2026 మీద పడింది. వచ్చే ఏడాది బాక్సాఫీస్ దగ్గర మూడు భారీ సినిమాలు తలపడబోతున్నాయి. మరి ఆ మ్యాజికల్ ఫిగర్ ని టచ్ చేసే సత్తా ఎవరికి ఉందో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

1000 Crore

ఈ రేసులో అందరికంటే ముందు వినిపిస్తున్న పేరు ప్రభాస్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ అంటేనే మాస్ వైబ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. దానికి ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే. కేవలం ఓపెనింగ్స్ తోనే సగం రికవరీ చేసే సత్తా ఉన్న ఈ కాంబినేషన్ కచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. కంటెంట్ ఏమాత్రం క్లిక్ అయినా రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయం.

తర్వాత గట్టి పోటీ ఇస్తోంది రణబీర్ కపూర్ ‘రామాయణ’. పురాణ ఇతిహాసాలకు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నితేష్ తివారీ పర్ఫెక్ట్ విజువల్స్ తో, బలమైన ఎమోషన్స్ తో వస్తున్నారట. గ్రాఫిక్స్ కరెక్ట్ గా కుదిరితే దేశవ్యాప్తంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారు. మైథలాజికల్ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఈ సినిమా వెయ్యి కోట్లు కాదు, అంతకు మించి వసూలు చేసే ఛాన్స్ ఉంది.

ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ మల్టీస్టారర్ ‘టైగర్ వర్సెస్ పఠాన్’. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒకే స్క్రీన్ మీద ఫుల్ లెంగ్త్ లో తలపడితే నార్త్ లో కలెక్షల వర్షం కురుస్తుంది. స్పై యూనివర్స్ మీద జనాలకు ఉన్న ఆసక్తి దీనికి అదనపు బలం. మొత్తానికి 2026లో మాస్, క్లాస్, మైథాలజీ.. ఇలా మూడు వేర్వేరు జానర్లలో గట్టి పోటీ నెలకొంది. కంటెంట్ కింగ్ అని రుజువైతే మాత్రం వచ్చే ఏడాది వెయ్యి కోట్ల సినిమాల హడావిడిని చూడొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus