Urvashi Rautela: గుడి కామెంట్లు సల్లబడ్డాయనా? కొత్త టాపిక్‌ ఎత్తుకున్న ఊర్వశి రౌటేలా?

మామూలుగా సినిమా పోస్టర్‌ల మీద ఎవరి ఫొటోలు వేస్తారు? స్టార్‌ హీరో సినిమా అయితే వీలైనంతవరకు హీరో ఫొటోలే ఉంటాయి. కొన్నిసార్లు హీరోయిన్‌, ఇతర ముఖ్య పాత్రల ఫొటోలు కూడా చిన్నగా ఉంటాయి. ఆ పాత్రల్లో ఐటెమ్‌ సాంగ్‌ భామ ఫొటో ఉంటుందా? ఈ ప్రశ్నలకు చాలా వరకు ‘లేదు’ అనే సమాధానం వస్తుంది. కానీ ఇటీవల ఓ సినిమా పోస్టర్‌ మీద ఐటెమ్‌ హీరోయిన్‌ ఫొటో కూడా వేశారు. అంటే చిన్న పాత్ర కూడా చేసింది అనుకోండి.

Urvashi Rautela

విషయం అది కాదు.. ఆ పోస్టర్‌ కారణంగా ఆమె ఓ ఓటీటీ సంస్థ సారీ కూడా చెప్పిందట. బాలకృష్ణ (Nandamuri Balakrishna)  హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj) . ఈ సంక్రాంతికి వచ్చి మంచి విజయం అందుకున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) ఓ చిన్న పాత్ర కోసం, ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఈ క్రమంలో పోస్టర్‌లో ఆమె ఫొటో కూడా ఉంది. అయితే సినిమాను స్ట్రీమ్‌ చేసిన ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్‌ చేసిన ఫొటోలో మాత్రం ఆమె ఫొటో లేదు.

ఈ విషయంలో ఆమెకు నెట్‌ఫ్లిక్స్‌ సారీ చెప్పిందట. తమ టీమ్‌ నుండి తప్పు జరిగింది అని కూడా అందట. ఈ మాటను ఊర్వశినే చెప్పింది. ఈ క్రమంలో ఆమె మాటల మీద కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఒరిజినల్‌ రిలీజ్‌ పోస్టర్‌లో ఉన్న నా ఫొటోను తీసేసి నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ షేర్‌ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌ కావాలనే అలా చేసిందని కొందరు అనుకున్నారు. అందులో నిజం లేదు. నెట్‌ఫ్లిక్స్‌ కావాలని ఆ పని చేయలేదు. అంతేకాదు తప్పు గ్రహించి మాకు సారీ చెప్పింది.

ఆ తర్వాత నా ఫొటోలతో ఉన్న కొత్త పోస్టర్లను షేర్‌ చేసింది అని గుర్తు చేసింది. కాకపోతే మొదట షేర్‌ చేసిన పోస్టర్‌లో నా ఫొటో లేకపోవడంపై అభిమానులు ఆగ్రహం చెందారు అని ఊర్వశి అంది. అన్నట్లు ఆమె ఆ సినిమాలో ఏం చేసిందో చెప్పలేదు కదా ఆ సినిమాలో ఊర్వశి ‘దబిడి దిబిడి’ అనే పాటకు స్టెప్పులేసింది. ఇక్కడో డౌట్‌ ఏంటంటే.. మొన్నీమధ్య తన పేరున గుడి ఉందంటూ కొన్ని కామెంట్లు చేసి ఇబ్బందుల్లో పడ్డ ఊర్వశి.. ఇప్పుడు పోస్టర్‌ కామెంట్లను భుజానికెత్తుకుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

హీరోయిన్స్‌ ఫ్రెండ్‌షిప్‌.. సీనియర్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమైందబ్బా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus