Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 24, 2026 / 09:10 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • హ‌షీర్‌,అలెన్‌, అజిన్‌, వినాయ‌క్ (Hero)
  • NA (Heroine)
  • అజు వ‌ర్గీస్‌, అల్పోన్స్ పుత్రేన్‌, విజ‌య్ బాబు, సుధీష్ త‌దిత‌రులు (Cast)
  • మలయాళీ మంకీస్ (Director)
  • సాహు గార‌పాటి (Producer)
  • సావిన్ ఎస్ఏ (Music)
  • అఖిల్ లైలాసుర‌న్‌ (Cinematography)
  • క‌ణ్ణ‌న్ మోహ‌న్‌ (Editor)
  • Release Date : 24 ఏప్రిల్ 2026
  • షైన్ స్క్రీన్స్ (Banner)

మ‌ల‌యాళంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన వాలా 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఏకంగా 200 కోట్ల‌కుపైగా వ‌సూళ్లతో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మ‌ల‌యాళంలో ఈ సినిమాను నిర్మించిన సాహు గార‌పాటి తెలుగు వెర్ష‌న్‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. హ‌షీర్‌,అలెన్‌, అజిన్‌, వినాయ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సావిన్ ఎస్ఏ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన వాలా 2 ఎలా ఉంది? మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందంటే?

Vaazha 2 Movie Review

Vaazha 2 Movie Review and Rating

క‌థ‌: హ‌షీర్‌, అలెన్ చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. అలెన్ చెల్లెలు అస్నాను అజిన్ ప్రేమిస్తున్నానంటూ వెంట‌ప‌డ‌తాడు. అజిన్‌, అత‌డి స్నేహితుడు వినాయ‌క్‌ను హ‌షీర్‌, అలెన్ కొడ‌తారు. గొడ‌వ‌ల‌తో మొద‌లైన వారి ప‌రిచ‌యం స్నేహంగా మారుతుంది. డ్ర‌గ్స్ మ‌త్తులో న‌లుగురు స్నేహితులు స్కూల్‌లో జ‌రిగిన ఓ గొడ‌వ‌లో మ‌నోజ్ అనే టీచ‌ర్ త‌ల‌ప‌గ‌ల‌గొడ‌తారు. పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లిన వారిని ఊరంతా చిన్న‌చూపు చూస్తారు. ఆ అవ‌మానాలు భ‌రించ‌లేక క‌ష్ట‌ప‌డి చ‌దివి ఇంట‌ర్‌మీడియ‌ట్ పాసై ఉన్న‌త చ‌దువుల కోసం యూకే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటారు.

హ‌షీర్‌ మాత్రం ఫెయిలై ఇండియాలోనే ఉండిపోతాడు. అలెన్‌, వినాయ‌క్ యూకే వెళ్ల‌గా…అజీన్ మాత్రం దుబాయ్ వెళ్లిపోయి త‌న అన్న‌య్య ప‌నిచేసే కంపెనీలోనే జాబ్‌లో చేర‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? యూకేలో వినాయ‌క్‌, అలెన్, దుబాయ్‌లో అజిన్ ఎలాంటి క‌ష్టాలు అనుభ‌వించారు? స‌ప్లిమెంట్ రాసి ఇంట‌ర్ పాసై త‌న స్నేహితుల ద‌గ్గ‌ర‌కు విదేశాల‌కు వెళ్లాల‌ని అనుకున్న హ‌షీర్ గంజాయి కేసులో ఎలా అరెస్ట్ అయ్యాడు? వినాయ‌క్ తండ్రికి ఏమైంది? తాను ప్రేమించిన షైనాను హ‌షీర్ మ‌ళ్లీ ఏ విధంగా క‌లుసుకున్నాడు? అన్న‌దే ఈ సినిమా మిగ‌తా క‌థ‌.

Vaazha 2 Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: కేర‌ళ‌లో సోష‌ల్ మీడియా ద్వారా ఫేమ‌స్ అయిన హ‌షీర్‌, అలెన్‌, అజిన్‌, వినాయ‌క్ త‌మ నిజ‌జీవిత పాత్ర‌ల‌నే ఈ సినిమాలో పోషించారు. వారిది న‌ట‌న అనే ఫీలింగ్ ఎక్క‌డ క‌ల‌గ‌దు. ఎమోష‌న్స్‌, కామెడీ విష‌యంలో అద‌ర‌గొట్టేశారు. ఈ న‌లుగురిలో హ‌షీర్ క్యారెక్ట‌ర్ ఎక్కువ‌గా హైలైట్ అయ్యింది. మ‌నోజ్ టీచ‌ర్‌గా అజు వ‌ర్గీస్, పోలీస్ ఆఫీస‌ర్‌గా డైరెక్ట‌ర్ ఆల్పోన్స్ పుత్రేన్ మెప్పించారు.

Vaazha 2 Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: టెక్నిక‌ల్‌గా ఏ టీమ్ అందించిన బీజీఎమ్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. థీమ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటుంది. పాట‌లు మాత్రం నిడివి పెంచ‌డానికే ఉప‌యోగ‌ప‌డ్డాయి. కేర‌ళ అందాల‌ను సినిమాటోగ్రాఫ‌ర్ అఖిల్ చ‌క్క‌గా చూపించారు. స్నేహం, ప్రేమ‌, ఫ్యామిలీ బాండింగ్‌… ఇలా అన్ని ఎమోష‌న్స్‌ను మిక్స్ చేస్తూ రైట‌ర్ విపిన్ దాస్ క‌థ‌ను రాసుకున్న తీరు బాగుంది. విపిన్ దాస్ క‌థ‌కు త‌న టేకింగ్‌తో ప్రాణం పోశారు డైరెక్ట‌ర్ సావిన్‌. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బాగున్నాయి. చిన్న సినిమా అనే ఫీల్ ఎక్క‌డ క‌ల‌గ‌దు.

Vaazha 2 Movie Review and Rating

విశ్లేష‌ణ‌: న‌లుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితాల నేప‌థ్యంలో యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు సావిన్ ఎస్ఏ వాలా 2 సినిమాను తెర‌కెక్కించారు. హైస్కూల్ ఏజ్‌లో కుర్రాళ్లు చేసే అల్ల‌ర్లు, తొలి ప్రేమ అనుభ‌వాలు, ఆవేశంతో అనాలోచితంగా వారు చేసే త‌ప్పుల‌ను మాత్ర‌మే కాకుండా లైఫ్‌లో ఎద‌గ‌డానికి వారు ప‌డే బాధ‌లు, సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సినిమాలో రియ‌లిస్టిక్‌గా ఆవిష్క‌రించారు. ఓ సినిమా చూసిన‌ట్లుగా కాకుండా నిజంగానే ఓ న‌లుగురు కుర్రాళ్ల జీవితాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసిన అనుభూతి క‌లిగించారు ద‌ర్శ‌కుడు.

చ‌దువుకునే వ‌య‌సులో పిల్ల‌లు చెడు అల‌వాట్ల బారిన ప‌డితే ఆ త‌ప్పుకు త‌ల్లిదండ్రుల‌తో పాటు విద్యాబుద్దులు నేర్పించే గురువులు కూడా బాధ్య‌త వ‌హించాల‌ని, కేవ‌లం దండ‌న ఒక్క‌టే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదంటూ నేటి విద్యా వ్య‌వ‌స్థ‌కు ఈ సినిమాతో ఓ మెసేజ్‌ను ఇచ్చారు ద‌ర్శ‌కుడు.

హ‌షీర్, అలెన్‌, అజిన్‌, వినాయ‌క్ స్కూల్‌లో చేసే గొడ‌వ‌లు, చిలిపి ప‌నుల‌తో వాలా 2 ఫ‌స్ట్ హాఫ్‌ స‌ర‌దాగా సాగిపోతుంది. అలెన్‌కు సున్తీ చేయ‌డం, థియేట‌ర్‌లో పోలీసుల‌ను న‌లుగురు స్నేహితులు ఆట‌ప‌ట్టించే సీన్లు హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయి. సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయిన మీమ్స్‌తో పాటు కొన్ని ఫేమ‌స్ డైలాగ్స్ వాడి న‌వ్వించారు ద‌ర్శ‌కుడు. ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్‌లో కాస్తంత వ‌య‌లెన్స్ ఎక్కువే అయ్యింది. స్కూల్‌లో పోలీస్ ఆఫీస‌ర్ ఇచ్చే స్పీచ్ కూడా లెక్చ‌ర్ ఇస్తున్న‌ట్లుగా బోరింగ్‌గా అనిపిస్తుంది.

సెకండాఫ్ కంప్లీట్ ఎమోష‌న‌ల్‌గా సినిమా ట‌ర్న్ అవుతుంది. యూకేలో డ‌బ్బులు స‌రిపోక‌, పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వినాయ‌క్‌, అలెన్ ప‌డే క‌ష్టాలు, మ‌రోవైపు చేసే జాబ్ న‌చ్చ‌క అజీన్ ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణతో వారిపై ఆడియెన్స్‌లో సింప‌థీ క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్‌. ఆ సీన్ల‌లో మ‌రీ క్రియేటివ్ లిబ‌ర్టీ ఎక్కువ‌గా తీసుకోకుండా అవ‌న్నీ ఆర్గానిక్‌గా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. వారంతా రియ‌లైజ్ అయ్యే సీన్ల‌లో సెంటిమెంట్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. తాను ఏం అనుకున్నారో అదే నిజాయితీగా చూపించారు డైరెక్ట‌ర్‌. మ‌రోవైపు ఇండియాలో హ‌షీర్ లైఫ్‌లో ఎదుర‌య్యే ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు మాసీగా చూపించారు. వాలా పార్ట్ వ‌న్ బ్యాచ్ క్లైమాక్స్‌లో చూపించి మూడో పార్ట్‌కు ఇచ్చిన లీడ్ బాగుంది.

సినిమా ర‌న్ టైమ్ ఎక్కువే. ఈజీగా ప‌దిహేను నుంచి అర‌గంట వ‌ర‌కు ట్రిమ్ చేయ‌చ్చు. కామెడీ కొన్ని చోట్ల అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. హ‌షీర్ పాత్ర‌కు ముగింపు క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు.

Vaazha 2 Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: వాలా 2 …..యూత్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే రియ‌లిస్టిక్ కామెడీ మూవీ

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajin Joy
  • #Alan Bin Siraj
  • #Biju Kuttan
  • #Hashir H
  • #Sahu Garapati

Reviews

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

17 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

17 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

18 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

18 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 days ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version