Vakkantham Vamsi: ‘ఎక్స్ట్రా’.. మొదటి పాట రెస్పాన్స్ తో దానిపై క్లారిటీ వచ్చేసింది

Advertisement

వక్కంతం వంశీ అందరికీ సుపరిచితమే. మొదట్లో పలు సీరియల్స్ లో నటించిన ఆయన తర్వాత రైటర్ గా ‘కిక్’ ‘రేసు గుర్రం’ ‘ఎవడు’ ‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి పనిచేశాడు. భారీ పారితోషికం అందుకునే దర్శకుల లిస్ట్ లో ఇతను కూడా చేరాడు. ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లు ఇతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ తో వర్కౌట్ కాక.. అల్లు అర్జున్ తో మొదటి సినిమా చేశాడు వక్కంతం వంశీ.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కంటెంట్ బాగున్నా.. ఎందుకో ఫలితం తేడా కొట్టింది. మొదటి నుండి ఆ సినిమాపై హైప్ ఏర్పడలేదు. మెయిన్ గా వక్కంతం వంశీ చేసిన తప్పు మ్యూజిక్ విషయంలో. ఆ సినిమాకి విశాల్ శేఖర్ అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసుకున్నాడు వంశీ. ఆ సినిమా పాటలు బాగున్నప్పటికీ ఎందుకో అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఈసారి కూడా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) అలాంటి తప్పే చేశాడు అని కొందరు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతను నితిన్ తో చేస్తున్న రెండో సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ ‘ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. అతని సంగీతంలో రూపొందిన తెలుగు సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. పాటలు బాగున్నా అవి అందరికీ నచ్చవు అనే రిమార్క్ ఉంది.

అందుకే జనాల్లో అలాంటి అభిప్రాయం ఏర్పడింది. అయితే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ ‘ చిత్రం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘డేంజర్ పిల్లా’ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus