ఆయనతో ఎన్టీఆర్ సినిమా లేనట్లే!!!

టాలీవుడ్ లో యువ హీరోల హడావిడి బాగా ఎక్కువ అయ్యింది. సూపర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్ కలెక్షన్స్ రేంజ్ ను 100కోట్లకు తీసుకెళ్లిన ఘనత వారిదే. అయితే అదే క్రమంలో వరుస హిట్స్ అయితే సాధిస్తున్నారు కానీ తమ తదుపరి సినిమాపై మాత్రం ఏమాత్రం ఫోకస్ పెట్టాలేక పోతున్నారు. అదే క్రమంలో సూపర్ హిట్ కొట్టిన తరువాత తమ తదుపరి సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన.

ఇదిలా ఉంటే తాజాగా బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా తన తదుపరి సినిమాను సైన్ చేయకుండా తెగ వెయిటింగులో పెట్టేశాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. అదే క్రమంలో ఎన్టీఆర్ సైతం వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టినప్పటికీ తన నెక్స్ట్ సినిమా పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు…ఏ సినిమాకు ఇంకా సైన్ చెయ్యలేదు…అసలైతే అసలు ఎన్టీఆర్ తదుపరి సినిమా వక్కంతం వంశీ డైరక్షన్లో రూపొందాలి. వక్కంతం వంశీ కధతో రెడీగా  ఉన్నాడు…కానీ దర్శకత్వం విషయంలో ఎన్టీఆర్ కాస్త వెనకడుగు వేసి వంశీని పక్కన పెట్టినట్లు టాక్. ఇక అదే క్రమంలో మనోడు తదుపరి సినిమా పూరీ జగన్నాధ్ తో చెయ్యాల్సి ఉంది. దానికి కల్యాణ్ రాజ్ ఇజమ్ సైతం మంచి ప్లస్ పాయంట్ గా నిలిచింది.

అయితే ఏమయిందో ఏమో కానీ…పూరితో సైతం సినిమాను చెయ్యడానికి ఎన్టీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు….ఇంకా మరొక రూమర్ ఏంటి అంటే…త్వరలో రాఘవేంద్రరావు తీయబోయే ఒక బాహుబలి తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తాడని రూమర్లు వచ్చాయి. మరో సంవత్సరంలో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని టాక్. కాని ఇందులో ఎంత నిజం ఉందో ఎవ్వరికీ తెలీదు….అయితే ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం అదంతా కేవలం మీడియా సృష్టే అని….ఇటు ఎన్టీఆర్ కాని.. అటు రాఘవేంద్రరావు కాని అలాంటి ప్రపోజల్ ఏమీ చేసుకోలేదు అని చెప్పేస్తున్నారు….అదన్న మాట మ్యాటరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus