సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ శుభ సందర్బంగా మహేష్ అభిమానులకు ఓ కానుకను అందించారు. ఊపిరి సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. పీవీపీ వారు ఈ సినిమా నిర్మించనున్నారు. అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.
‘‘మంచి కథ, భారీ తారాగణం, అనుభవం కలిగిన సాంకేతిక నిపుణుల కలయికలో ఈ సినిమా ఉంటుంది. మహేష్, వంశీ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అని నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి చెప్పారు. ప్రస్తుతం మహేష్‌బాబు, మరుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రం షూటింగ్ కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి ఈ ఫిలిం ని కంప్లీట్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. ఆ తర్వాత కొరటాల శివ తో సినిమా చేస్తారు.
అనంతరం వంశీ పైడిపల్లి సినిమా మొదలవుతుంది. పూరి జగన్నాథ్ జనగణమన అంటూ ఓ కథ తో సిద్ధంగా ఉన్నారు. అతనికి సూపర్ స్టార్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో తెలియదు. బహుశా వచ్చే ఏడాది చివర్లో పూరీ సినిమా పట్టాలెక్కే విధంగా కనిపిస్తోంది.