Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Reviews » Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 19, 2026 / 08:08 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజ‌య్ ఆంటోనీ (Hero)
  • స్వాసిక‌ (Heroine)
  • అజ‌య్ దిషాన్‌, కావ్య అనిల్‌, శ‌క్తి రాజ్‌, లిజోమోల్ జోస్‌, క‌రుణాస్ త‌దిత‌రులు (Cast)
  • శ‌శి (Director)
  • విజ‌య్ ఆంటోనీ (Producer)
  • బాలాజీ శ్రీరామ్‌ (Music)
  • ద‌ర్శ‌న్ కిర్లోస్ (Cinematography)
  • హ‌రీష్ యువ‌రాజ్‌ (Editor)
  • Release Date : 19th జూన్ 2026
  • విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ (Banner)

హీరో విజ‌య్ ఆంటోనీ, డైరెక్ట‌ర్ శ‌శి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బిచ్చ‌గాడు త‌మిళంతో పాటు తెలుగులో భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మ‌రో మూవీ వంద దేవుళ్లు (Vanda Devullu). విజ‌య్ ఆంటోనీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించారు. స్వాసిక‌, అజ‌య్ దిషాన్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. వంద దేవుళ్లు మూవీ ఎలా ఉంది? బిచ్చ‌గాడు మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా? లేదా? అంటే?

Vanda Devullu Movie Review

Vanda Devullu Movie Review And Rating

క‌థ‌: వాస‌వి (స్వాసిక‌) భ‌ర్త చ‌నిపోతాడు. ఎన్నో క‌ష్టాలు ప‌డి కొడుకులు భాస్క‌ర్ (అజ‌య్ దిషాన్‌), వివేక్‌ల‌ను(శ‌క్తి రాజ్‌) చ‌దివిస్తుంటుంది. వాస‌వి ఒంట‌రిత‌నాన్ని ఆస‌రాగా చేసుకొని ఊళ్లోని మ‌గాళ్లు ఆమెపై క‌న్నేస్తారు. వారంద‌రికి బుద్ది చెబుతూ ధైర్యంగా ముందుకు సాగుతుంది. త‌న‌కు తోడు కావాల‌నే ఆలోచ‌న‌తో వాస‌వి మ‌ళ్లీ పెళ్లిచేసుకోవాల‌ని అనుకుంటుంది. ఆమె పెద్ద కొడుకు భాస్క‌ర్ మాత్రం త‌ల్లి మ‌రో పెళ్లిని వ్య‌తిరేకిస్తాడు. వాస‌వి ఒంట‌రిజీవితం, త‌మ కోసం ప‌డుతున్న‌ క‌ష్టం భాస్క‌ర్‌లో మార్పు తీసుకొస్తుంది. . త‌ల్లికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల‌ని భాస్క‌ర్‌తో పాటు అత‌డి త‌మ్ముడు వివేక్‌ బ‌లంగా నిర్ణ‌యించుకుంటారు. కొడుకుల నిర్ణ‌యాన్ని ఈ సారి వాస‌వి వ్య‌తిరేకిస్తుంది. ఆమె ఎందుకులా చేసింది? 43 ఏళ్ల వ‌య‌సులో వాస‌వి పెళ్లి జ‌రిగిందా? ఆమె జీవితంలోకి వ‌చ్చిన ఏడు కొండ‌లు (విజ‌య్ ఆంటోనీ) ఎవ‌రు? వాస‌వి పెళ్లికి ఊరి ప్రెసిడెంట్‌తో పాటు ప్ర‌జ‌లు ఎందుకు అడ్డుచెప్పారు? వాస‌విని చంపాల‌ని ఆమె త‌ల్లితో పాటు సొంత అన్న‌య్య ఏం చేశారు? ఏడుకొండ‌లును త‌మ తండ్రిగా భాస్క‌ర్‌, వివేక్ అంగీక‌రించారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Vanda Devullu Movie Review And Rating

న‌టీన‌టుల ప‌నితీరు: వంద దేవుళ్లు సినిమాకు వ‌న్ ఉమెన్ షోగా స్వాసిక నిలిచింది. భ‌ర్త లేని ఒంట‌రి మ‌హిళ పాత్ర‌లో జీవించింది. స్వాసిక‌ను కాకుండా నిజంగానే వాస‌వి అనే మ‌హిళ జీవితాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన‌ట్లుగా అనిపిస్తుంది. అంత‌లా క్యారెక్ట‌ర్‌లో లీన‌మైంది. త‌న న‌ట‌న‌తో విజ‌య్ ఆంటోనీతో పాటు అంద‌రిని డామినేట్ చేసింది. విజ‌య్ ఆంటోనీ క్యారెక్ట‌ర్ సెకండాఫ్‌లోనే సినిమాలో క‌నిపిస్తుంది. హీరోయిజం ఛాయ‌లేవి లేకుండా సింపుల్‌గా సాగే పాత్ర‌కు న్యాయం చేశారు. భాస్క‌ర్ పాత్ర‌లో అజ‌య్ దిషాన్ ఆక‌ట్టుకున్నారు. కావ్య అనిల్‌, శ‌క్తి రాజ్‌, లిజోమోల్ జోస్‌, క‌రుణాస్‌తో పాటు మిగిలిన వారు త‌మ ప‌రిధుల మేర మెప్పించారు.

Vanda Devullu Movie Review And Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: వంద దేవుళ్లు సినిమా కోసం డైరెక్ట‌ర్ శ‌శి మంచి మెసేజ్‌తో కూడిన క‌థ‌ను ఎంచుకున్నారు. కానీ ఈ పాయింట్‌ను స్క్రీన్‌పై ఆవిష్క‌రించిన తీరు డాక్యుమెంట‌రీలా అనిపిస్తుంది. త‌మిళ ఫ్లేవ‌ర్ ఎక్కువైపోయింది. బాలాజీ శ్రీరామ్ పాట‌లు గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రాఫ‌ర్ ద‌ర్శ‌న్ కిర్లోస్ ప‌ల్లెటూరి అందాల‌ను నాచుర‌ల్‌గా చూపించారు. ఈ సినిమాకు విజ‌య్ ఆంటోనీ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లోనే ఈ సినిమాను తెర‌కెక్కించారు. చాలా వ‌ర‌కు ఒకే పూరి గుడిసెలోనే ఈ సినిమా సాగుతుంది.

Vanda Devullu Movie Review And Rating

విశ్లేష‌ణ‌: రెండో పెళ్లి విష‌యంలో స‌మాజంలో ఉండే అపోహ‌లు, అపార్థాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా వంద దేవుళ్లు సినిమాలో చూపించారు డైరెక్ట‌ర్ శ‌శి. భార్య చ‌నిపోయిన త‌ర్వాత మ‌గాడు మ‌రో పెళ్లి చేసుకుంటే స‌మాజం ఎలాంటి అడ్డు చెప్ప‌దు. కానీ భ‌ర్త మ‌ర‌ణించిన త‌ర్వాత తోడు కోసం మ‌హిళ‌ల రెండో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే ఎన్నో ఆంక్ష‌లు, అడ్డంకులు ఎదుర్కోవాల్సిఉంటుంద‌నే అంశాన్ని త‌ల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఎమోష‌న‌ల్‌గా సినిమాలో చూపించారు. ఫ‌స్ట్ హాఫ్ చాలా వ‌ర‌కు వాస‌వి, భాస్క‌ర్‌, వివేక్ పాత్ర‌ల చుట్టే తిరుగుతుంది. చూపించిన సీన్ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ చూపిస్తూ సాగ‌దీశారు.

వాస‌వి క‌ష్టాలు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఎప్పుడైతే విజ‌య్ ఆంటోనీ ఎంట్రీ ఇస్తాడో క‌థ‌లో అప్ప‌టినుంచే ఊపు వ‌స్తుంది. సొంత కూతురినే చంపాల‌ని వాస‌వి త‌ల్లి ప్ర‌య‌త్నించే సీన్ అదిరిపోతుంది. అలాంటి సీన్లు కొన్ని బాగానే రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. కానీ ఆ ఫ్లోను కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. హీరోపై ఫైట్ పెట్టేసి రెగ్యుల‌ర్ క్లైమాక్స్‌లా సినిమాను ఎండ్ చేయకుండా డిఫ‌రెంట్‌గా ఆలోచించారు డైరెక్ట‌ర్‌. భాస్క‌ర్‌, వివేక్ ల‌వ్‌స్టోరీస్‌ను ఇంకాస్త అందంగా చూపిస్తే బాగుండేది.

Vanda Devullu Movie Review And Rating

ఫోక‌స్ పాయింట్‌: వంద దేవుళ్లు ప్ర‌య‌త్నం మంచిదే కానీ త‌మిళ వాస‌న‌లే ఎక్కువ‌య్యాయి.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay dhishan
  • #Karunaas
  • #Kavya Anil
  • #Sasi
  • #Swasika

Reviews

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

18 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

3 days ago

latest news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

21 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

22 hours ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

2 days ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

2 days ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version