నేను ఎక్కడికీ వెళ్ళను.. ఇక్కడే ఉంటా : వరలక్ష్మీ

కోలీవుడ్ హీరో విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నారని గత కొంతంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు కోలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాల పై స్పందించిన స్పందించిన ఈ జంట… ‘మా మధ్యలో అలాంటిదేమి లేదు.. మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే’… అంటూ చెప్పినప్పటికీ వీరి పై పెళ్ళి వార్తలు ఆగలేదు. అయితే ఇటీవల విశాల్‌ పెళ్ళి చేసుకోబోతున్నట్టు కూడా అధికార ప్రకటన వచ్చేసింది. విశాల్ తండ్రి.. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అయిన జీకే.రెడ్డి ఇటీవల ఒక ప్రెస్ మీట్లో విశాల్‌కు పెళ్ళి కుదిరిందని, అమ్మాయి పేరు అనీషా అని తెలిపాడు. ఇక హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనున్నట్టు కూడా పేర్కొన్నారు.

విశాల్‌కు పెళ్ళి సెట్‌ అవ్వడంతో…. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కూడా త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతోందని… పెళ్ళైన తరువాత నటనకు కూడా గుడ్‌బై చెప్పనుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరందుకుండడంతో… దీనికి వరలక్ష్మి ఘాటుగా స్పందించింది “కొంతమంది పనీపాటా… లేని వాళ్లు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు, నేను ఇప్పట్లో పెళ్ళి చేసుకోను .. పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతానని కొంతమంది కలలు కంటున్నారు…, నేను ఎక్కడికీ వెళ్ళను .. ఇక్కడే వుంటాను .. సినిమాలు చేస్తూనే వుంటాను. నేను ఎవరిని ఉద్దేశించి ఈ స్టేట్ మెంట్ ఇస్తున్నానన్నది .. వారికి అర్థమయ్యే ఉంటుంది. ఎన్ని నాటకాలు ఆడినా నన్ను తొక్కెయ్యలేరు ” అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది వరలక్ష్మి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus