ప్రభాస్ కి మాత్రమే ‘ఐ లవ్ యు’ చెప్తానంటున్న వరలక్ష్మీ..!

విభిన్న పాత్రలు ఎంచుకుంటూ కోలీవుడ్ లో తన సత్తా చాటుతుంది… ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా , విలన్ గా ఇలా ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది వరలక్ష్మీ. అంతే కాదు బయట కూడా ముక్కుసూటిగా… ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం అనడంలో సందేహం లేదు. గతంలో విశాల్ తో ప్రేమాయణం నడుపుతుందని… తొందరలోనే తనని పెళ్ళి చేసుకోబోతుందని పదే.. పదే వార్తల్లో నిలిచింది వరలక్ష్మీ. అయితే అలాంటిదేమీ లేదని… మేము మంచి స్నేహితులం మాత్రమే అని వరలక్ష్మీ ఖండించించిన సంగతి కూడా తెలిసిందే. తరువాత విశాల్ పెళ్ళి ప్రకటనతో ఆ పుకార్లు సమాప్తమయ్యాయి కూడా..! ఇదిలా ఉంటే తాజాగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆసక్తికరమైన కామెంట్ చేసింది వరలక్ష్మీ.

వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది వరలక్ష్మీ. ఇందులో భాగంగా వరలక్ష్మీ… ప్రభాస్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. వరలక్ష్మి మాట్లాడుతూ… “నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నాకు ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలని ఉంది అంటే… అది ప్రభాస్ కి మాత్రమే చెప్పాలని ఉంది”… అంటూ ఆసక్తిరమైన కామెంట్స్ చేసింది ఈ కోలీవుడ్ భామ. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఏమైనా… ‘6 అడుగుల 2 అంగుళాల’ మన డార్లింగ్ ప్రభాస్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే’ .. అని వరలక్ష్మీ కామెంట్స్ పై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus