ప్రభాస్ ని అభినందించిన బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్

  • June 20, 2017 / 07:26 AM IST

తెలుగు పరిశ్రమలోని స్టార్స్ ని ప్రభాస్ గురించి అడిగితే వారు చెప్పే ఒకే ఒక మాట మంచి వ్యక్తి అని. ఇప్పుడు ఇదే మాటను బాలీవుడ్ స్టార్స్ చెబుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒకే భాషకు పరిమితం కాకుండా ఇండియన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నారు. దక్షిణాది ప్రజలతో పాటు ఉత్తరాది వారు కూడా తమ హీరోగా భావిస్తున్నారు. అభిమానిస్తున్నారు. ఆ విధంగానే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రభాస్ నటనకి ఫిదా అయిపోయారు. ఏకంకా ప్రభాస్ ని కలిసి బాహుబలిలో సినిమాలో కీలకమైన #WKKB ఫోజులో ఫోటో తీసుకున్నారు.

ఆ ఫోటోని తాజాగా తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తూ “బాహుబలి ని చంపి చరిత్ర సృష్టించిన వారు ఇద్దరే ఉన్నారు. ఒకరు కట్టప్ప అయితే.. రెండోది నేను” అంటూ సరదాగా కామెంట్ చేశారు. అంతేకాదు “ప్రభాస్ లాంటి నిగర్విని నేను చూడలేదు, స్టార్ అన్న భావనే అతనిలో కనిపించలేదు” అని అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం ప్రభాస్, వరుణ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus