పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు డెలివరీ టైం దగ్గర పడటంతో తాజాగా రెయిన్‌బో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తుంది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారట.ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి రెయిన్ బో హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.

Varun tej and Lavanya Tripathi

అక్కడ నాగబాబు, వరుణ్ తేజ్ ను కలిసి తన అభినందనలు ఆనందం తెలిపారట. అనంతరం లావణ్య, బిడ్డను చూసి ఆశీర్వదించినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్, ఉపాసన కూడా రెయిన్ బో హాస్పిటల్ కి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఒకానొక సినిమా ఈవెంట్లో చిరంజీవి తన కూతుర్లకు, కొడుక్కి ఆడపిల్లలే పుట్టారు. దీంతో నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి.. చరణ్- ఉపాసనలను ‘ఒక్క మగబిడ్డ కావాలని కోరినట్లు’ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుణ్ తేజ్ కు బాబు పుట్టడంతో చిరు కూడా మురిసిపోయినట్టు తెలుస్తుంది.

ఇక వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి… 2023 నవంబర్లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంది. ఇక ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చింది అని తెలియడంతో ఆమె ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus