సాయిధరమ్ తేజ్ ని ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!

‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆ చిత్రం ఆశించిన ఫలితనాన్ని ఇవ్వలేకపోయినా.. నటుడిగా వరుణ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక తరువాత చేసిన ‘కంచె’ చిత్రానికి మంచి రివ్యూలు, మౌత్ టాక్ వచ్చినప్పటికీ యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఇక తరువాత మాస్ అండ్ యాక్షన్ ప్రయోగాలు చేసిన ‘లోఫర్’ ‘మిస్టర్’ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. అయినా నిరాశ చెందకుండా ముందుకు సాగాడు. ‘ఫిదా’ చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వెంటనే ‘తొలిప్రేమ’ చిత్రంతో కూడా మంచి హిట్ అందుకున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న తరుణంలో ‘అంతరిక్షం’ చిత్రం కొంత నిరాశపరిచినా.. ‘ఎఫ్ 2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేసి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు.

ఈ నేపథ్యంలో వరుణ్ నెక్స్ట్ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు వరుణ్. ఇందులో బాక్సర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీతో తన మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నాడు వరుణ్. ‘ఎఫ్ 2’ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన వరుణ్.. బాక్సర్ క్యారెక్టర్ కోసం ఫిట్‌‌గా కనిపించేందుకు చాలా వర్కౌట్ లు చేస్తున్నాడట. దీని కోసం తన బావ సాయిధరమ్ తేజ్ ని ఫాలో అవుతున్నాడట. ‘చిత్రలహరి’ చిత్రానికి ముందు బాగా బొద్దుగా ఉన్న సాయిధరమ్.. అమెరికాకు వెళ్ళి మరీ ఫిట్‌నెస్‌ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుణ్ కూడా అదే బాటలో నడవబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ మూడు నెలల పాటు బాక్సర్ పాత్ర కోసం చాలా కసరత్తులు చేస్తున్నాడట. ఇక ‘రియల్ బాక్సర్’ లుక్ కోసం వరుణ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus