‘వాల్మీకి’ లో పూజా హెగ్దే పాత్రని లీక్ చేసిన వరుణ్ తేజ్

వరుణ్ తేజ్, పూజా హెగ్దే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రానికి ముందు ‘ముకుంద’ చిత్రంలో వీళ్ళిద్దరూ జంటగా నటించారు. ఐదేళ్ళ తరువాత వీళ్ళిద్దరూ మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ‘వాల్మీకి’ వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఇక ఈ వేడుకలో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ కొన్ని కీలక విషయాల్ని లీక్ చేసేసాడు. “ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీలు, ప్రయోగత్మాక చిత్రాలు చేసిన నేను మొదటిసారి మాస్ క్యారెక్టర్ చేయడం చాలా బాగుంది. ‘మేము మాస్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తామో నీకు తెలీదు రా’ అని చిరంజీవి గారు అంటుంటే ఏంటో అనుకున్నాను… ఏమైనా ఆ కిక్కే వేరబ్బా…” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అదే పనిలో ‘వాల్మీకి’ చిత్రంలో పూజా పాత్ర గురించి కూడా మాట్లాడాడు. “నా మొదటి సినిమాలో ఇంత అందమైన హీరోయిన్ ను ఇచ్చి.. మాట్లాడే అవకాశం లేకుండా పోయిందే.. అని బాధ పడ్డాను. ఆ లోటుని ఈ చిత్రంతో హరీష్ శంకర్ తీర్చేసాడు. ఇక ఈ చిత్రంలో పూజా ఎపిసోడ్ కాసేపే అయినా కచ్చితంగా ఆకట్టుకుంటుంది” అని వరుణ్ చెప్పుకొచ్చాడు. అంటే ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మాత్రమే పూజా కనిపించబోతున్నమాట. వరుణ్ ఇలా అసలు విషయాన్ని బయటపెట్టడంతో పూజా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ రోల్ లో పూజా కనిపిస్తుందేమో అని వారు ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారు. వరుణ్ ఇలా చెప్పడంతో వారు హర్ట్ అయ్యారన్న మాట..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus