ఈ ఏడాది జూన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకుని చాలామందికి షాకిచ్చారు. ఎందుకంటే వీళ్లిద్దరూ గత ఆరేడేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఈ విషయం బయటపడలేదు. దీంతో ఎంగేజ్మెంట్ హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇది జరిగిన దాదాపు నాలుగు నెలల తర్వాత నవంబరు 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబర్ అంతా కూడా పెళ్లి హడావుడి, మిగతా కార్యక్రమాలతో బిజీ అయిపోయిన న్యూలీ వెడ్డింగ్ కపుల్.. ఇప్పుడు ఎంచక్కా వెకేషన్‌కి వెళ్లిపోయారు.
అయితే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసా? హనీమూన్ టూర్లో! అవును… ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే…కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది.
వరుణ్-లావణ్య ఫిన్ ల్యాండ్ హనిమూన్ వెళ్లిన విషయం తెలిసిన తరువాత మెగాఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అయితే ఫిన్ ల్యాండ్ అంటే మెగా ఫ్యామిలీకి ఇష్టం అనుకుంట అని కామెంట్స్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్నాళ్ల క్రితం ఆ మంచు ప్రదేశానికి వెళ్లారు. ఇప్పుడు (Varun Tej) వరుణ్ తేజ్, లావణ్య దంపతులు సైతం అక్కడికి వెళ్లారు. ఇప్పుడు వార్త వైరల్ గా మారింది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!