Varun Tej: సినిమాలు ఫ్లాపవుతున్నా వరుణ్ మార్కెట్ తగ్గలేదుగా.. ఏమైందంటే?

  • September 30, 2023 / 12:09 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడే హీరోలలో వరుణ్ తేజ్ ముందువరసలో ఉంటారు. వరుణ్ తేజ్ సోలో హీరోగా నటించిన గని, గాండీవదారి అర్జున సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్నిసొంతం చేసుకోలేదు. వరుణ్ తేజ్ తర్వాత సినిమాలతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మరో 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సినిమాలు ఫ్లాపవుతున్నా వరుణ్ మార్కెట్ తగ్గలేదుగా అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

వరుణ్ తేజ్ (Varun Tej) రిస్క్ లేని సినిమాలను మాత్రమే ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతోంది. వరుణ్ తేజ్ సినిమాకు హిట్ టాక్ వస్తే బాగానే కలెక్షన్లు వస్తున్నా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం నామమాత్రపు కలెక్షన్లు రావడం లేదు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.

వరుణ్ తేజ్ కు పెళ్లి తర్వాత కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. మెగా హీరోలతో కలిసి వరుణ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus