క్లాస్ చిత్రాలను అందించిన శేఖర్ కమ్ముల ఈ సారి రొమాంటిక్ లవ్ స్టోరీతో మనముందుకు రాబోతున్నారు. ఒక ఎన్నారై, తెలంగాణ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందో వెండి తెరపై చూపించనున్నారు. ఈ చిత్రంలో అమెరికా అబ్బాయిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి నటించనున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో “మిస్టర్” చిత్రీకరణలో బిజీగా ఉన్నవరుణ్ తేజ్.. శేఖర్ కమ్ముల చిత్రానికి డేట్స్ కేటాయించారు.
“మిస్టర్” మొదటి షెడ్యూల్ పూర్తి చేసి కమ్ములతో కలిసి పాత్ర విశేషాలను తెలుసుకుంటున్నారు. ఈ చర్చల్లోకి చిత్ర నాయిక సాయి పల్లవి కూడా జయినా అయ్యారు. మలయాళం “ప్రేమమ్” సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈ భామ తెలుగులో ఈ చిత్రంతో అడుగు పెట్టనుంది. వైద్య విద్యను రీసెంట్ గా కంప్లీట్ చేసిన పల్లవి ఇక తన పూర్తి సమయాన్ని సినిమాలకు కేటాయించనుంది.
వరుణ్ తేజ్ తో కలిసి శేఖర్ కమ్ముల వద్ద నటనా మెళకువలను నేర్చుకుంటోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైన వీరి ముగ్గురి ఫోటో శుక్రవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శేఖర్ కమ్ముల సినిమాను ఎంత ప్రీ ప్లాన్డ్ గా చేస్తారో ఈ ఫోటో చూయిస్తోంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 25 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.