‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో స్టైలిష్ లుక్‌లో అదరగొట్టిన వరుణ్ తేజ్.. తన తర్వాతి చిత్రంలో పూర్తి మాస్ లుక్‌లోకి మారబోతున్నాడు. ఎప్పుడో ‘లోఫర్’ సినిమాలో అలా కనిపించిన వరుణ్.. మళ్లీ ఇన్నాళ్లు ఆ స్టైల్ ట్రై చేయబోతున్నాడు. అది కూడా కల్ట్ మాస్ లుక్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది అంతటి మాస్ డైరక్టర్ కాబట్టి. ఆ డైరక్టర్ ఎవరో కాదు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుణ్ ఓ సినిమా చేయనున్నాడు. అది ఇదే. అంతేకాదు దీని కోసం ఊర మాస్ పేరొకటి రెడీ చేశారట.
కరుణ కుమార్ ఇప్పటికే తన స్క్రిప్ట్‌ను వరుణ్ తేజ్‌కు వినిపించే.. ఆ క్యారెక్టరైజేషన్, బ్యాగ్రౌండ్‌కి ఫిదా అయ్యాడ. దీంతో పూర్తి స్థాయి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు అని అంటున్నారు. మరోవైపు కరుణ కుమార్ అండ్ టీమ్ ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో సినిమాకు ‘మట్కా’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఇదొక పీరియాడిక్ క్రైమ్ సినిమా అని సమాచారం. అంటే కరుణ కుమార్ మనల్ని వెనకటి రోజుల దగ్గరకు తీసుకెళ్లబోతున్నారన్నమా.
ఈ సినిమాను ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే తెరకెక్కిస్తారట. 80, 90ల కాలంలో బాగా ఫేమస్ అయిన గ్యాంబ్లింగ్ అయిన ‘మట్కా’ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. అదే ప్రాంతానికి చెందిన కరుణ కుమార్‌కు దీని గురించి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ మరిన్ని డీటైల్స్ కోసం చాలా రీసెర్చ్ చేశారట. వరుణ్ తేజ్ ఈ క్యారెక్టర్ కోసం మేకోవర్ కూడా అవుతాడట. రెండో సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’తో ఇబ్బంది పడిన కరుణ కుమార్ ఈ సినిమాతో ఏం చేస్తారో చూఆలి.
ఇక వరుణ్ తేజ్ (Varun Tej) ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ చేస్తున్నాడు. అలాగే శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ‘మట్కా’ సినిమా ఉండొచ్చు అని టాక్. అయితే ‘కోటబొమ్మాళి పోలీసు స్టేషన్’ అనే సినిమా కూడా కరుణ కుమార్ దగ్గర ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడొస్తుందో తెలియాలి.