మెగాస్టార్ పాటను ఉపయోగించుకోనున్న వరుణ్ తేజ్

  • February 13, 2018 / 01:32 PM IST

మెగాస్టర్ చిరంజీవి సినిమాలు ఎంత బాగుంటాయో.. ఆయన సినిమాలోని పాటలు మరింత బాగుంటాయి. అందుకే అవి నేటి తరం వారిని సైతం ఆకట్టుకుంటున్నాయి. ఆ క్రేజ్ తోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి స్టెప్పులతో అదరగొట్టారు. అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా చిరు పాటలకు స్టెప్పులేసి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ మెగాస్టార్ పాటని రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఫిదా సినిమా సాధించిన భారీ కలక్షన్స్ తో కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ తాజాగా తొలి ప్రేమ మూవీతో ఆ పేరుని నిలబెట్టుకున్నారు.

బాబాయ్ పవన్ కళ్యాణ్ పేరుతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న వరుణ్… పెదనాన్న చిరంజీవి పాటతో బ్లాక్ బస్టర్ హిట్ కైవశం చేసుకోవాలని అనుకుంటున్నారు. తొలి ప్రేమ తర్వాత వరుణ్ తేజ్ ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతరిక్ష నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీలో మెగాస్టార్ హిట్ సినిమా రుద్రవీణ లోని “నమ్మకు నమ్మకు” సాంగ్ ను రీమిక్స్ చేస్తానని వరుణ్ ప్రకటించారు. వరుణ్ మెగాస్టార్ పాటను రీమిక్స్ చేయాడాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus