గోపిచంద్ మలినేని ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడుగా..!

  • November 5, 2022 / 11:46 AM IST

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా పిచ్చ హ్యాపీగా ఉన్న స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఒక్క నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులే.. అభిమానులు అందరికీ ఉంటారు కానీ బాలయ్యకి మాత్రం భక్తులు ఉంటారు.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు, టాక్ షో, ఇప్పుడు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్.. అందులోనూ ‘అఖండ’ తో కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం, ఫస్ట్ టైమ్ వంద కోట్ల మార్క్ టచ్ చేయడం, పాండమిక్ తర్వాత తండోపతండాలుగా ప్రేక్షకాభిమాలు వచ్చేలా చేసి, థియేటర్లు జాతరను తలపించేలా చేయడం..

సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్నివ్వడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఇప్పటివరకు తెలియక బాలయ్య గురించి మరోలా అనుకున్న వారు కూడా ఇప్పుడాయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతున్నారు.. మీకు మీరే సాటి అంటూ సలాం చేస్తున్నారు.. బయట ఫ్యాన్స్, ఆడియన్స్ సంగతే ఇలా ఉంటే.. ఇక ఇండస్ట్రీలోని దర్శకుల్లో కూడా చాలామంది బాలయ్య అభిమానులు ఉన్నారు.. వారిలో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఇప్పుడు నటసింహాన్ని ‘వీర సింహా రెడ్డి’ గా చూపించబోతున్నారు..

బాలయ్య షో లో ‘సమరసింహా రెడ్డి’ సినిమా రిలీజ్ రోజు టికెట్ల కోసం జరిగిన గొడవ కారణంగా ఒక రోజంతా పోలీస్ స్టేషన్‌లో ఉన్నానని చెప్పారు గోపిచంద్.. ఆ మాట చాలదా ఆయన ఎంత పెద్ద బాలయ్య అభిమానో చెప్పడానికి.. తన ఫేవరెట్ యాక్టర్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు బహుశా ఆయన పొందిన ఆనందం, అనుభూతి ఇంకెవరూ పొంది ఉండరు.. ‘‘చిన్నప్పుడు చొక్కాలు చించుకుని ఒక్కసారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయణ్ణి డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో.

బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్‌‌మెంట్ కంటే లైఫ్ టైమ్ రెస్పాన్సిబులిటీగా భావిస్తూ.. జై బాలయ్య’’ అంటూ ‘వీర సింహా రెడ్డి’ ఓపెనింగ్ రోజు గోపిచంద్ చేసిన పోస్టుతో బాలయ్య అభిమానులు సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయారు.. టైటిల్ అనౌన్స్‌మెంట్ రోజు.. ‘‘ఒక బాలయ్య అభిమానిగా సినిమా తీశా.. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నా కానీ ఇప్పుడు రిలీజ్ చేసినా సినిమా సూపర్ హిట్ అవుతుంది’’ అని కొండారెడ్డి బురుజు సాక్షిగా చెప్పి నందమూరి అభిమానుల అంచనాలను ఆకాశామంత ఎత్తుకి తీసుకెళ్లిపోయారు..

సంక్రాంతికి సింహం బాక్సాఫీస్ బరిలో దిగబోతుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చే, పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.. ఒక వీరాభిమాని, తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది?.. అంటే, దానికి సమాధానం ‘వీర సింహా రెడ్డి’ అంటున్నారు.. గోపిచంద్ మలినేని ఇప్పటివరకు తీసిన మూవీస్ మేకింగ్ దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది.. పాండమిక్ టైంల్ ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త జోష్ నింపారు.. ‘క్రాక్’ తో మాస్ మహారాజ రవితేజ, గోపిచంద్ ట్రాక్‌లోకి వచ్చారు.

‘పోతరాజు వీరశంకర్’ అనే పవర్ ఫుల్ సీఐగా రవితేజని సరికొత్తగా చూపించారు. ఇక తన ఫేవరెట్ హీరోని ఎలా చూపించి ఉంటారో ఊహించుకోవచ్చు.. ‘వీర సింహా రెడ్డి’ లో బాలయ్య తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు.. ఈ సినిమా ఔట్ పుట్ అదిరిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ‘‘వీర సింహా రెడ్డి’ స్టోరీ, సాంగ్స్, బాలయ్య డ్యాన్స్, గూస్ బంప్స్ తెప్పించే ఫైట్స్, డైనమెట్స్‌లా పేలే డైలాగ్స్, మరీ ముఖ్యంగా బాలయ్య బాబు ఎలివేషన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి..

బోయపాటికి బాబులా ఉన్నాడు గోపిచంద్.. బాలయ్య మరోసారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నాడు.. మొత్తానికి మలినేని ఫ్యాన్ బాయ్ అనిపించుకున్నాడు.. సంక్రాంతికి సింహం జూలు విదిలించబోతుంది.. తెలుగు ఇండస్ట్రీ కొత్త ఊపిరి పీల్చుకోబోతుంది’’ అంటూ భారీ హైప్ క్రియేట్ చేసేలా.. బాలయ్య అభిమానులకి పూనకాలు తెప్పించే టాక్స్ వినిపిస్తున్నాయి.. మరికొద్ది రోజుల్లో వెండితెర మీద ‘వీర సింహా రెడ్డి’ విజృంభణ చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకాభిమానులు..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus