వీరే ది వెడ్డింగ్ పార్ట్ 2 రెడీ అవుతుందట!

హిట్టయిన సినిమాలకే సీక్వెల్స్ తీయడానికి నానా ఇబ్బందులుపడుతున్న తరుణంలో గత వారం విడుదలై.. అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని కాకుండా కేవలం కొన్ని వర్గాల వారిని మాత్రమే ఆకట్టుకొన్న “వీరే ది వెడ్డింగ్” చిత్రానికి సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నారట దర్శకనిర్మాతలు. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం అడల్ట్ ఫిలిమ్ గా పేరు తెచ్చుకొన్నప్పటికీ.. ఫెమినిస్టులు, యూత్ ఆదరించడంతో హిట్ గా నిలవగలిగింది. లెక్కలేనన్ని బూతులు, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు సినిమా విజయంలో కీలకపాత్రలు పోషించగా.. “సెక్స్ ఇన్ ది సిటీ” తరహా కథాంశం మెట్రో సిటీ ప్రేక్షకులకి బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారు దర్శకనిర్మాతలు.

ఈ సెకండ్ పార్ట్ లో కూడా కరీనా, సోనమ్, స్వర భాస్కర్ కీలకపాత్రలు పోషించనున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ అడల్ట్ కామెడీ & స్కిన్ షోతో సెకండ్ పార్ట్ ఉండబోతోందని ఆల్రెడీ నిర్మాత ఏక్తా కపూర్ ప్రకటించగా.. కొందరు మాత్రం అసలు ఫస్ట్ పార్టే అనవసరం అనుకుంటే.. మళ్ళీ సీక్వెల్ అవసరమా అని వాదిస్తున్నారు. అయినా ఇప్పుడు సినిమాలకి ఎంత గొడవ అయితే అంత పబ్లిసిటీ అనే విషయం అందరికీ తెలిసిందే కదా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus