మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్న వెంకటేష్

  • July 7, 2018 / 05:55 AM IST

చంటి వంటి అమాయకమైన పాత్రలను మాత్రమే కాదు.. పవర్ ఫుల్ గణేష్ లాంటి పాత్రలను విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పండించగలరు. ఇక ఒంటి మీదకు ఖాకీ డ్రస్ వస్తే మాత్రం ఎదుటోడికి చమటలు పట్టాల్సిందే. ఇదివరకు సూపర్ పోలీస్, సూర్య ఐపీఎస్ చిత్రాల్లో అదరగొట్టారు. ముఖ్యంగా ఘర్షణ సినిమాలో అయితే అతని నటనని మాటల్లో వర్ణించలేము. అటువంటి పవర్ ఫుల్ పోలీస్ గా మరోసారి వెంకీ కనిపించబోతున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. గురు సినిమా తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి “ఎఫ్ 2 ” అనే సినిమాని చేస్తున్నారు.

రీసెంట్ గా షూటింగ్ మొదలైన సినిమాని హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ఓ చిత్రం చేయబోతున్నారు. ఇందుకు వెంకీ మామ అనే టైటిల్ అనుకున్నట్టు సమాచారం. దీని తర్వాత సినిమాకి కూడా వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. “సినిమా చూపిస్త మామా”, “నేను లోకల్‌” వంటి చిత్రాలతో విజయాల్ని అందుకొన్న త్రినాథరావు చెప్పిన కథ వెంకటేష్‌కి బాగా నచ్చిందట. అందులో వెంకీ ఓ పోలీసు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం త్రినాథరావు “హలో గురూ ప్రేమకోసమే” అనే చిత్రం చేస్తున్నారు అది పూర్తయిన తర్వాత వెంకటేష్‌ కోసం స్క్రిప్ట్ పనులు చక్కబెట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus