Venkatesh , Anil Ravipudi: ‘సంక్రాంతికి వస్తున్నాం’… ఇది రిలీజ్‌ డేట్‌ కాదు… అంతకుమించి..!

  • February 29, 2024 / 03:26 PM IST

వెంకటేశ్ 76వ సినిమా ఇదే అంటూ… ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తారని మాత్రం పుకార్లు వస్తున్నాయి. అనిల్‌కు బాగా కలిసొచ్చిన దిల్‌ రాజు నిర్మాతగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది అంటున్న ఈ సినిమాకు టైటిల్‌ దాదాపు ఫిక్స్‌ చేసేశారు అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది వాళ్ల కాన్సెప్ట్.

టైటిల్‌ చెప్పకుండా ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అనేది చెబుతున్నారు అనుకుంటున్నారా. మీరు చదివింది డేట్‌ కాదు.. సినిమా టైటిలే. అవును ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరును ఫిక్స్‌ చేశారట. ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ కామెడీ జోనర్‌లో ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమా పేరును ఇప్పటికే చిత్రబృందం ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించింది. పేరుకు తగ్గట్టే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట.

‘సంక్రాంతికి వస్తున్నాం… హిట్‌ కొడుతున్నాం’ అనే మాట టాలీవుడ్‌లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మాటనే టైటిల్‌ చేసేశారు. దానికితోడు వెంకటేశ్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా అచ్చొచ్చింది. ఆయన సినిమాలు పెద్ద పండగకి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు సంక్రాంతికే వచ్చాయి. నిర్మాత దిల్‌ రాజుకు కూడా సంక్రాంతి బాగా సెంటిమెంట్‌. ప్రతి యేడు ఆ సీజన్‌లో ఓ సినిమా వచ్చేలా చూసుకుంటారు.

ఇలా ఏ రకంగా చూసినా ఈ టీమ్‌కి సెంటిమెంట్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా ఆ సీజన్‌ పేరుతోనే సినిమా తీసేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే చిత్రీకరణను ప్రారంభిస్తారట. అలాగే వెంకీ (Venkatesh) కోసం త్రిషను హీరోయిన్‌గా తీసుకుంటారు అని అంటున్నారు. అదే జరిగితే ఆమెతో వెంకీ నాలుగో సినిమా చేస్తున్నాట్లు. గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’, ‘నమో వేంకటేశ’, ‘బాడీ గార్డ్‌’ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus