టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేశ్ కు ప్రేక్షకులలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేశ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరికొన్ని గంటల్లో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే సైంధవ్ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేశ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గురించి, ఆ సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొంతకాలం క్రితం తాను ఒక పోస్టర్ ను చూశానని ఆ పోస్టర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సీక్వెల్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని ఆయన అన్నారు. ఆ పోస్టర్ లో తమను వైల్డ్ గా చూపించారని వెంకటేశ్ కామెంట్లు చేశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్టు నేను, మహేశ్ ఉన్న ఆ పోస్టర్ సరదాగా అనిపించిందని వెంకటేశ్ వెల్లడించడం గమనార్హం. వెంకీకి ఆ పోస్టర్ ఎంతగానో నచ్చిందని ఆయన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.
శ్రీకాంత్ అడ్డాల అలాంటి కథను ప్లాన్ చేసి వినిపిస్తే పెద్దోడు, చిన్నోడు కాంబినేషన్ ను మరోసారి చూడొచ్చు. రాబోయే రోజుల్లో ఈ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. వెంకటేశ్, మహేశ్ కాంబోను మరోసారి చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. మరోవైపు సైంధవ్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చెప్పుకునే స్థాయిలోనే ఉన్నాయి.
శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సైంధవ్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. సినిమాలో చివరి 20 నిమిషాలు వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సైంధవ్ సక్సెస్ సాధిస్తే వెంకటేశ్ (Venkatesh) మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.