Venkatesh: ఆ సినిమా రీమేక్‌కు సిద్ధమవుతున్న వెంకటేశ్‌… ఆ పాత్రలో ఎవరో?

  • March 11, 2024 / 02:00 PM IST

దేశంలో ఏదో ఓ చోట ఓ సినిమా మంచి విజయం అందుకుంది అంటే, మంచి పేరు తెచ్చుకుంది అంటే… ఆ విషయం హైదరాబాద్‌లో ముందుగా చేరేది ప్రముఖ కథానాయకుడు (Venkatesh) విక్టరీ వెంకటేశ్‌కి. ఈ మాటలు కాస్త అతిశయోక్తిగా అనిపించొచ్చు కానీ… ఆయన సినిమాలను అంతగా పరిశీలించి వివరాలు తెలుసుకుంటారు అని చెప్పడం మా ఉద్దేశం. అలా వెంకీ మనసు ఇప్పుడు బాలీవుడ్‌ సినిమా ‘సైతాన్‌’ మీద పడింది అని చెబుతున్నారు.

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా ‘సైతాన్’. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లే వస్తున్నాయి. (Ajay Devgn) అజయ్ దేవగన్, జ్యోతిక (Jyothika) జంటగా నటించిన ఈ సినిమాలో (Madhavan) మాధవన్ విలన్‌గా కనిపించాడు. ఈ సినిమాకు తొలుత మిశ్రమ స్పందన వచ్చినా… ఆ తర్వాత వసూళ్లు పెరిగాయి అని అంటున్నారు. ముంబయిలో శనివారం వీకెండ్ అర్ధరాత్రి షోలు వేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌లో ‘వష్’గా వచ్చి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న సినిమాకు రీమేకే ఈ ‘సైతాన్‌’.

దీంతో ఇప్పుడు వెంకీ చూపు ‘వష్‌’ మీద పడింది అంటున్నారు. ఆ సినిమాను తీసుకొని ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేయించి సినిమా చేద్దాం అనుకుంటున్నారట. అయితే ‘సైతాన్’ సినిమాలో మాధవన్ వన్ మ్యాన్ షో చేశాడు. పేరుకే విలన్‌ అయినా… సినిమాలో హీరో తరహాలో ఎలివేషన్లు, సీన్లు ఉన్నాయట. దీంతో తెలుగులో అలానే తీస్తారా? లేక మారుస్తారా అనేది చూడాలి. ఒకవేళ హిందీ తరహాలో వెళ్తే హీరోయిజం సరిగ్గా ఉండదు, పండదు కూడా.

ఇక వెంకటేశ్‌ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేస్తారని టాక్‌. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు కూడా పరిశీలనలో ఉందట. ఈ సినిమా తర్వాత ‘రానా నాయుడు’ సీజన్ 2 ఉంటుందట. మరి ‘సైతాన్‌’ ఓకే అయితే ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూడాలి.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus