Venkatesh, Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ తో వెంకీమామ!

  • April 21, 2022 / 10:04 AM IST

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తనకు తగినట్లుగా కథలు ఎన్నుకొని ఇప్పటికీ హిట్ మీద హిట్టు అందుకుంటున్నారు. ఆయన నటించిన ‘ఎఫ్2’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఎఫ్3’ను తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరోగా కనిపించనున్నారు.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. వెంకీ తాజాగా ఓ బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీలకపాత్ర కోసం వెంకటేష్ ను సంప్రదించగా.. ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్-వెంకటేష్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. అందుకే వెంకీ గెస్ట్ రోల్ అయినా ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.

ప్రస్తుతం వెంకీ.. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus