రవితేజ ప్లేస్ లో రానా వచ్చాడు..!

  • March 13, 2019 / 05:32 PM IST

విక్టరీ వెంకటేష్.. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలు చేసాడు. తరువాత రామ్, వరుణ్ తేజ్ వంటి యువ హీరోలతో కూడా చేసాడు. ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కూడా కలిసి ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నాడు.అయితే విక్టరీ వెంకటేష్ నాన్న గారు దివంగత రామానాయుడు గారికి ఓ కోరిక ఉండేదంట. అదేంటే ఆయన చిన్నకొడుకు వెంకటేష్… తన మనవడు రానాతో కలిసి నటిస్తే చూడాలనే కోరిక అనమాట.అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన కన్ను మూసారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ వంటి చిత్రంలో ఓ పాటకి ఆడి పాడినా… అది రామానాయుడు గారికి గానీ ఇటు దగ్గుబాటి అభిమానులకి గానీ అది పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేదు. స్వయంగా రామానాయుడు గారు… తన పెద్ద కొడుకు సురేష్ బాబుతో కలిసి అప్పట్లో ఎన్నో కథల కోసం పరీశీలించారట. ఇక ఆయన మరణించిన తరువాత దీని గురించి సురేష్ బాబు, వెంకటేష్ , రానా పెద్దగా పట్టించుకోవడం కుదర్లేదట.

అయితే ఇప్పుడు వెంకటేష్ తన అన్న కొడుకు రానాతో కలిసి సినిమా చేయడానికి రంగం సిద్ధమయ్యిందట. ఇన్నాళ్టికి రామానాయుడు గారి కోరిక తీరబోతుందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. విషయంలోకి వెళితే గతంలో దర్శకుడు వీరు పోట్ల.. వెంకటేష్ కి ఓ కథ వినిపించాడు. అది మల్టీస్టారర్ కథ. ఒక హీరోగా వెంకీ మరో హీరోగా మాస్ మహా రాజ్ రవితేజ అనుకున్నారు. అయితే అప్పుడు ఫుల్ స్క్రిప్ట్ అవ్వలేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది… అయితే రవితేజ ప్లేస్లో ఇప్పుడు రానాని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. సురేష్ బాబు, అనీల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus