Venkatesh: వెంకటేష్ కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా..!

  • October 25, 2023 / 11:42 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి వివాదాలకు దూరంగా ఉంటూ.. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. అందుకే ఆయనని అందరి హీరోల ఫ్యాన్స్ అభిమానిస్తుంటారు. ఇలా అభిమానించే హీరోలు ఇండస్ట్రీలో చాలా అరుదే అనే చెప్పుకోవాలి. సినిమాల విషయంలో తప్పిదే.. వెంకటేష్ ఫ్యామిలీ విషయాలపై ఎప్పుడూ వార్తలు రావు.. వైరల్ కావు. ట్రోలింగ్స్ వంటివి కూడా వెంకటేష్ ఫ్యామిలీపై ఉండవు. అంత కామ్‌గా తన లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు విక్టరీ వెంకీ.

ఇప్పుడాయన రెండో కుమార్తె వివాహం గురించి వార్తలు బయటికి రావడంతో.. వెంకటేష్ పేరు ట్రెండ్ అవుతోంది. వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జైపూర్‌లో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఆ దంపతులు స్పెయిన్‌లో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) తన రెండో కుమార్తె హయవాహిని వివాహంపై దృష్టి పెట్టారు.

విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడితో హయవాహిని వివాహం జరగబోతోందని తెలుస్తోంది. హయవాహిని వివాహానికి సంబంధించి బుధవారం విజయవాడలో నిశ్చితార్థ వేడుకను కూడా నిర్వహించినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ నిశ్చితార్థాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ చాలా రహస్యంగా జరిపించడంతో.. విషయం బయటికి రాలేదు. నిశ్చితార్థం అనంతరం పెళ్లి ఎప్పుడనే విషయాన్ని మాత్రం తెలియజేసే అవకాశం ఉంది.

ఇండస్ట్రీలోని వారికి కూడా ఈ నిశ్చితార్థం గురించి తెలియదని, కేవలం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన బంధువులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారనేలా వార్తలు వినబడుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వెంకటేష్ మూడో కుమార్తె భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. పర్సనల్ విషయాల్లో వెంకీ అంత కామ్‌గా ఉంటాడు మరి. మరోవైపు దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ వివాహం కూడా త్వరలోనే జరగనుందనే విషయం తెలిసిందే.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus