మరో బాలీవుడ్ రీమేక్ లో వెంకీ!

  • October 6, 2017 / 08:53 AM IST

తెలుగులో అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన కథానాయకుడిగా ఇప్పటికే రికార్డ్ ను సొంతం చేసుకొన్న విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ కు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ లో రూపొంది చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా దండిగా రాబట్టుకొన్న “హిందీ మీడియం”ను తెలుగులో “తెలుగు మీడియం”గా రీమేక్ చేసేందుకు వెంకీ రెడీ అని సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో ఇర్ఫాన్ ఖాన్ పోషించిన పాత్రలో వెంకీ కనిపించనున్నారు.

“అలా మొదలైంది” ఫేమ్ నందినిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వెలువడనుందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ “తెలుగు తప్పనిసరి” అని రీసెంట్ గా రూల్ పాస్ చేసి ఉండడంతో.. ఈ నేపధ్యంలో “తెలుగు మీడియం”కు ట్యాక్స్ ఎగ్జంప్షన్ తోపాటు బోలెడన్ని లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయి స్కూల్ లో తమ అమ్మాయిని చేర్పించేందుకు భార్యాభర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులే “హిందీ మీడియం” కథాంశం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus