Venky Atluri, Dulquer Salmaan: సైలెంట్ గా స్టార్ట్ అయిపోయిన వెంకీ అట్లూరి – దుల్కర్ ల మూవీ.. బడ్జెట్ ఎంతో తెలుసా?

Advertisement

గతేడాది సీతా రామం తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, ఈ ఏడాది ధనుష్ కి సార్ వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్ పై సాయి సౌజన్య కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం కొలవలేని ఎత్తులకు.ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణంగా ఈ చిత్రం కథ ఉంటుంది అని తెలుస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.

దాదాపు సార్ కి పని చేసిన టీం ఈ సినిమాకి కూడా పనిచేస్తుంది. తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏక కాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు తర్వాత హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికైంది. సార్ లానే ఈ మూవీ కూడా వంద కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అంతా భావిస్తున్నారు. బడ్జెట్ రూ.60 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus